ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రంకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్కసుమన్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… కేంద్రం వరి రైతులకు ఉరి వేస్తోందని, కేంద్రం వరికి ఉరి వేస్తే వారికి ఘోరి కడుతామని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి నలుగురు ఎంపీలను గెలిపిస్తే రైతులను నట్టేట ముంచారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులకు రైతాంగంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, వాళ్లకి అబద్ధాల మీద ఉన్న ప్రేమ ఆదుకోవడంలో ఉండదని ఆయన ఎద్దేవా చేశారు. అంబానీ, అదానీల మీద ఉన్న ప్రేమ అన్నం పెట్టే రైతులపై లేదని, తెలంగాణ రైతుల పట్ల కేంద్ర మంత్రులు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారన్నారు.
పంజాబ్‌లో పూర్తిస్థాయి ధాన్యం సేకరిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ వడ్లను కేంద్రం కొంటదా? కొనదా? సమాధానం చెప్పేదాకా బీజేపీని, కేంద్రాన్ని వదిలిపెట్టేది లేదని ఆయన వెల్లడించారు. తెలంగాణలో వడ్లను కొంటారో? లేదో? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాలన్నారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం కుటిలనీతిని బయటపెట్టాలని, రైతులకు నిజం తెలియాల్సిందేనని బీజేపీ నాయకులను నీలాదీయండన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ వాళ్లను ఎక్కడికక్కడ నిలదీయండని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందన్నారు.
Minister KTR : గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై.. కేటీఆర్ ఏమన్నారంటే..?