Bandi Sanjay: మూడేళ్లలో ఐదు సార్లు ఛార్జీలు పెంచారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్టీసీ ఛార్జీలను 60 శాతం పెంచిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్ కే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) వద్ద బీజేపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఈ సందర్భంగా.. బండి సంజయ్ అక్కడికి చేరుకుని ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడారు. జగిత్యాల వైపు వెళ్లే బస్సులో ప్రయాణికులతో మాట్లాడి ఛార్జీల పెంపుపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలకు ఆర్టీసీ బస్సులే దిక్కు అని చెప్పారు. మూడేళ్లలో ఐదు సార్లు ఛార్జీలు పెంచారని ఆయన విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని.. ఆ కుట్రలో భాగమే ఛార్జీల పెంపు అని సంజయ్ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీలు, ఆరు డీఏలు కూడా ఇంకా చెల్లించలేదని ఆయన విమర్శించారు. తొలుత జేబీఎస్ వద్దకు బండి సంజయ్ వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. బంజారాహిల్స్ లోని ఆయన నివాసం వద్దకు భారీగా చేరుకుని గృహనిర్బంధం చేశారు. ఆతర్వాత పోలీస్ ఎస్కార్ట్ లో సంజయ్ జేబీఎస్ కు వెళ్లి ప్రయాణికులతో మాట్లాడారు.
Also Read
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Tags
- bandi sanjay
- charges
- comments
- Hike
- rtc
తాజావార్తలు
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
OTR: శ్రీకాకుళం మేయర్ సీటు కోసం గుండ లక్ష్మీదేవి ప్రయత్నాలు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!