కేసీఆర్ రాజు అని రాష్ట్ర ముఖ్యమంత్రి గడీల నుంచి బయటకు రాడని విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని అన్నారు. చేసిన తప్పులను సమర్థించుకునే మూర్ఖడు రాష్ట్ర ముఖ్యమంత్రి అని విమర్శించాడు. రాష్ట్రంలో 15 లక్షల ఎకరాలు ధరణిలో నమోదు కాలేదని.. నమోదైన వాటిలో 50 శాతం తప్పులే ఉన్నాయని అన్నారు. . ధరణి అనేది గొప్ప పోర్టల్ అని చెబుతున్నాడని.. సీఎంది నోరా మోరా అని విమర్శించారు.…
‘కశ్మీర్ ఫైల్స్’ మూవీ వచ్చిన దగ్గర నుండి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్… హైదరాబాద్ స్వాతంత్రోద్యమంతో ముడిపడిన రజాకార్ల ఆగడాలు సైతం వెండితెరపైకి ఎక్కాలని భావిస్తున్నారు. ‘కశ్మీర్ ఫైల్స్’ మూవీని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఇప్పుడు ‘ఢిల్లీ ఫైల్స్’ పేరుతో ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన శిక్కుల ఉచకోత మీద మరో సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇదిలా ఉంటే… తాజాగా కేంద్ర…
దేశంలో నీతి వంతమైన పాలన సాగుతుంది కాబట్టే 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ స్థానాలను గెలుచుకున్నామని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందామని ఆయన అన్నారు. బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని.. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని.. ఇటీవల జరిగిన బహిరంగ సభను చూసి కేసీఆర్ భయపడుతున్నారని ఆయన అన్నారు. మీ పార్టీ నాయకులు గోడ మీద ఉన్నారని.. దూకేందుకు సిద్ధం అయ్యారని ఆయన అన్నారు.…
దక్షిణ తెలంగాణను పూర్తిగా ఎడారిగా మార్చిన తెలంగాణ ద్రోహివి అని కేసీఆర్ ను విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. లక్ష కోట్లు మింగి కాళేశ్వరాన్ని కట్టావని.. జూరాల, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల సంగతేంటని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం మొత్తం నీటిని దోచుకుంటుందని దాని గురించి మాట్లాడటం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు చాలా మంది ఉన్నారని.. మీ పార్టీలో ఏక్ నాథ్…
రోజులు దగ్గర పడ్డప్పుడు మాటలు ఇలాగే వస్తాయని.. జోగులాంబ అమ్మవారిని కంచపరిచే స్థాయికి చేరావ్ అని సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జోగులాంబ అమ్మవారిని తిట్టే స్థాయికి, వ్యంగంగా మాట్లాడే స్థాయికి వచ్చావంటే ఈ రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు.. ఫామ్ హౌజ్ లో పడుకోవాలని సలహా ఇచ్చారు. హిందు సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, లేకపోతే కరీంనగర్ లో పట్టిన గతే పడుతుందని అన్నారు.…
బీజేపీ తెలంగాణలో జోరు పెంచుతోంది. క్రమంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీ బైక్ ర్యాలీలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 21 నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ బైక్ ర్యాలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ‘ప్రజలు, పల్లె ఘోష బీజేపీ భరోసా’ పేరుతో బైక్ ర్యాలీలు చెపట్టనుంది. ఒక్కో నేతకు నాలుగు నియోజక వర్గాల్లో ర్యాలీలు అప్పచెప్పారు. మొత్తం 30 మంది నాయకులు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. ఒక్కో…