Whats today updates 06.07.2022,
1. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,100లుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,470లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 64,700లుగా ఉంది.
2. నేడు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బోనాలు నిర్వహించనున్నారు.
3. నేడు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఇవాళ ఉదయం 9గంటలకు ఆన్‌లైన్‌లో 12,15,17 తేదీలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.
4. నేడు బీజేపీ జాయినింగ్స్ కమిటీ తొలి భేటీ జరుగనుంది. బండి సంజయ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో జిల్లాల వారీగా బీజేపీలో చేరికలపై చర్చించనున్నారు. చేరికల కమిటీ కన్వీనర్‌గా ఈటల రాజేందర్ వ్యవహరిస్తున్నారు.
5. నేడు కిసాన్ కాంగ్రెస్ ధరణి రచ్చబండ కార్యక్రమం నిర్వహించనుంది. ఉదయం 11 గంటలకు ఇందిరాపార్క్ దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
6. నేటితో ఇంటర్ రీవాల్యుయేషన్ గడువు ముగియనుంది. ఇప్పటివరకు 18వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.