బండి సంజయ్ యాత్రపై టీఆర్ఎస్ చేసిన దాడిని తెలంగాణ బిజిపి వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ ఖండించారు. ఎన్టీవీతో మాట్లాడారు. బెంగాల్ తరహా విధ్వంసాలకు టీఆర్ఎస్ పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ గుండాలతో సంజయ్ యాత్రను ఆపాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎలాంటి కుట్రలు చేసినా ప్రజా సంగ్రామ యాత్ర ఆగదని స్పష్టం చేశారు. కేసీఆర్ అధికారం కోల్పోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు తరుణ్ చుగ్. పోలీసుల తీరు సైతం సరిగ్గా లేదని విమర్శించారు.…
Bandi Sanjay: పోస్టర్లు వేయడం మేము మొదలుపెడితే టిఆర్ఎస్, కాంగ్రెస్ లు తట్టుకోలేవని బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. యాదాద్రి జిల్లా పొడిచెడు గ్రామం వద్ద ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసిన విషయంపై ఎన్టీవీతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఎంతకు అమ్ముడుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లోకి వెళ్లిన నేతలు ఎంత తీసుకున్నారని ప్రశ్నల…
‘‘హర్ ఘర్ తిరంగా జెండా‘‘ కార్యక్రమంలో భాగంగా అమ్మనబోలులోని ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద మువ్వన్నెల జాతీయ పతాకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. దేశ భక్తి పాటలు, స్వాతంత్ర సమరయోధుల వీరోచిత పోరాటాల గీతాల ఆలాపనతో పాదయాత్ర శిబిరం సందడిగా మారింది. ఆజాదీ కా అమ్రుత మహోత్సవ్ లో భాగంగా 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 15న వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించే విషయంలో ప్రతి…
Bandi Sanjay Letter to CM KCR: రాఖీ పౌర్ణమి సందర్భంగా డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు రూ.4 వేల కోట్ల వడ్డీబకాయిల విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్ బహిరంగ లేఖ రాసారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ , పట్టణపేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), ఎస్‌హెచ్‌జి లకు ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు రూ.4 వేల కోట్ల వరకు పేరుకుపోయాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎనిమిది సంవత్సరాల పాలనలో డ్వాక్రా గ్రూపులను…
CPI Narayana fire on Bandi Sanjay: బండి సంజయ్ పై సీపీఐ నారాయణ ఫైర్ అయ్యారు. మునుగోడు లో పోటీ చేయాలా వద్దా అనేది మేము తెల్చుకుంటామని మాగురించి చెప్పడానికి నువ్వెవవడివి కోన్ కిస్కావి అంటూ మండిపడ్డారు. బండి సంజయ్ వి పనికిమాలిన మాటలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. మాగురించి మాట్లాడే టప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, దమ్ము, ధైర్యం గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? అంటూ ప్రశ్నించారు. నీకున్న దమ్ము ఏంటి? అని…