Bandi Sanjay will honor the media photographers: నేడు అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా పట్టణంలో యాత్ర శిబిరం వద్ద ఉదయం 10 గంటలకు బండి సంజయ్ మీడియా ఫోటో గ్రాఫర్లను సన్మానించనున్నారు. జనగామ జిల్లాలో బండి సంజయ్ చేపట్టిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర 17 వ రోజులో జనగామ జిల్లాలో కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా జనగంలో 4వ రోజు కొనసాగుతున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో నేడు 15 కిలో మీటర్లుదూరం పాదయాత్ర కొనసాగించనున్నారు. జనగామ రెడ్డి సంఘం భవనం నుండి ప్రారంభం అయ్యి చీటకోడూరు, చౌడారాం, బాషా తండా, రామచంద్ర గూడెం, లక్ష్మి తండా, మందారం గ్రామాల మీదుగా ఖిలశాపూర్ వరకు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. రాత్రి ఖిలశాపూర్ వద్ద బండి సంజయ్ బస చేయనున్నారు.
నిన్న బండి సంజయ్ చేపట్టిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర 16 వ రోజులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగనుంది. జనగామ జిల్లాలోని లింగాల ఘనపూర్ మండలం కుందారం శివారు నుంచి నెల్లుట్ల నుండి జనగామ పట్టణం వరకు 15 కిలో మీటర్ల దూరం కొనసాగింది. సాయంత్రం 5 గంటలకు జనగామ పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తాలో 10 వేల మందితో భారీ బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొనిప్రసంగించారు. టీఆర్ఎస్, పోలీసులను అడ్డుపెట్టుకుని గూండాగిరి చేస్తోందని ఆరోపించారు. మీ గూండాగిరికి,దాడులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని ఆయన పేర్కొన్నారు. బీజేపీతో బల ప్రదర్శనకు సీఎం కేసీఆర్ము సిద్ధమా అని సంజయ్ సవాల్ విసిరారు.
EX MLA Arrest: రెండు దశాబ్దాలుగా కనిపించకుండా పోయిన బిహార్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్