బండి సంజయ్ చేపట్టిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర 16 వ రోజులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు 4వ రోజు కొనసాగనుంది. జనగామ జిల్లాలోని లింగాల ఘనపూర్ మండలం కుందారం శివారు నుంచి యాత్ర ప్రారంభమై నెల్లుట్ల మీదగా జనగామ పట్టణానికి పాదయాత్ర చేరుకుంటుంది. నెల్లుట్ల నుండి జనగామ పట్టణం వరకు 15 కిలో మీటర్ల దూరం కొనసాగునుంది. పట్టణంలోని కలెక్టరేట్ ఆర్టీసీ చౌరస్తా, నెహ్రు పార్క్, MRO కార్యాలయం మీదుగా వర్ధన్ అనాధ ఆశ్రమం వరకు యాత్ర సాగనుంది. ఉదయం 9 గంటలకు కుందారం వద్ద ధూప, దీప, నైవేద్యం నిధుల విడుదల, దేవాలయ భూముల, అర్చక సంక్షేమ నిధులపై బ్రామ్మన సంఘం పెద్దలతో బండి సంజయ్ సమావేశమై చర్చించనున్నారు.
11 గంటలకు యాత్ర ప్రారంభమై నెల్లుట్ల కు చేరుకుంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆర్టీసీ కాలనీ లో నూతనంగా నిర్మిస్తున్న బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద భోజనం చేసి, ఆ తర్వాత ప్రారంభయ్యే యాత్ర సాయంత్రం 5 గంటల వరకూ జనగామ పట్టణానికి చేరుకుంటుంది. జనగామ పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తాలో 10 వేల మందితో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడనున్నారు రాత్రి వర్ధన్ అశ్రమంలో బండి సంజయ్ బస చేయనున్నారు.
Incharge of BJP Bahiranga Sabha: మునుగోడులో అమిత్ షా సభకు ఇంఛార్జీలు వీరే..!