ప్రజాసంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో దశ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నేడు జనగామ జిల్లాలోని దేవరుప్పుల పాఠశాలలో జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే.. బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ నాయకుల రాళ్ళ దాడి చేశారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ప్రసంగిస్తుండగా అభ్యంతరం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నాయకులు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించిన బండి సంజయ్.. దేశంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారని బండి సంజయ్ ని అడిగిన టీఆర్ఎస్ నాయకులు.. దీంతో టీఆర్ఎస్ ,బీజేపీ నాయకుల మధ్య వాగ్వివాదం…ఉద్రిక్తత చోటు చేసుకుంది.
బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. దీంతో.. సీపీ ఏం చేస్తున్నాడంటూ బండి సంజయ్ సీరియస్ అయ్యారు. ఇంటెలిజెన్స్ వాళ్ళకు మా పాదయాత్ర తెలుసుగా పోలీసులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. దమ్ముంటే సీఎం కేసీఆర్ రాష్ర్టంలో పాదయాత్ర చేయాలన్నారు. అంతేకాకుండా.. పాదయాత్రలో మహిళ బీజేపీ కార్యకర్తలు ఉన్న కారుపై టీఆర్‌ఎస్ శ్రేణులు రాళ్లతో దాడి చేశారు. దీంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయి.