ప్రజా సంగ్రామ యాత్రలో అధికార టీఆర్ఎస్‌తో పాటు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. బస్సు చార్జీలు, కరెంట్ చార్జీలు పెంచితే మెడలు వంచుతాం అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. మంచి జరిగితే రాష్ట్రం, చెడు జరిగితే కేంద్రంది అంటారంటూ ఫైర్ అయిన ఆయన.. లీటర్ పెట్రోల్‌పై రూ.26 వ్యాట్ , రూ. 14 టాక్స్ తీసుకుంటున్నారని.. మళ్లీ ఆర్టీసీ చార్జీలు పెంచుతామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఒక్కో లీటర్ పై రూ.40 దోచుకుంటున్న టీఆర్ఎస్ సర్కార్.. ఆ సొమ్మును తగ్గించుకుంటే ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సిన అవసరమే లేదన్న ఆయన.. ఆర్టీసీ, కరెంట్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాల్సిందేనని.. లేనిపక్షంలో కేసీఆర్ మెడలు వంచి బీజేపీ దమ్ము చూపుతాం అన్నారు.
ఇక, ఆర్టీసీ కార్మికులకు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదన్నారు బండి సంజయ్.. 26 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించిన ఆయన.. ఆర్టీసీ ఆస్తులు అమ్మడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.. అత్యాచారాల్లో తెలంగాణ నాల్గో స్థానంలో ఉంది.. హోం మంత్రి కేవలం పాత బస్తీకి మాత్రమే హోం మంత్రి అని.. మహిళలపై జరుగుతున్న దాడులపై మాత్రం మాట్లాడరు అని మండిపడ్డారు.. పోడు భూములపై ఇప్పటి వరకు సీఎం స్పందించ లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్.. బియ్యానికి, వడ్లకు సంబంధం ఏంటో సీఎం సమాధానం చెప్పాలన్నారు.. రైతులు పండించిన పంట కొనకపోతే ఫామ్ హౌస్ ను దున్నిస్తా అని ప్రకటించిన ఆయన.. రైతులతో కలిసి పామ్ హౌస్ ని ముట్టడిస్తాం అన్నారు.. మోడీ పై ఉద్యమం చేస్తున్న పార్టీలు ఎప్పుడో కేసీఆర్ కు 80 శాతం డిస్కౌంట్ కు అమ్ముడుపోయాయని విమర్శించారు బండి సంజయ్.