ఈటలను గెలిపిస్తాం.. మోడీకి గిఫ్ట్‌గా ఇస్తాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప ఎన్నికల్లో హుజురాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తాం.. ఈటల రాజేందర్‌ను గెలిపించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి గిఫ్ట్‌గా ఇస్తాం అని ప్రకటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సిద్దిపేట జిల్లా కోహెడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో ప్రతి వరి గింజ కొంటామన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు వరి వేస్తే ఊరే అని ఏలా అంటున్నారు అని ప్రశ్నించారు. అయితే, కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో గులాబ్ తుఫాన్ పోయింది.. కానీ, గులాబీ తుఫాను మాత్రం పోవడం లేదన్న ఆయన.. రాబోయే ఎన్నికల్లో గులాబీ పార్టీని ఓట్ల తుఫాన్‌లో కొట్టుకు పోయేలా చేస్తా అన్నారు.
మరోవైపు మంత్రి కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు బండి సంజయ్ కుమార్.. సిరిసిల్లలో వర్షానికి ఇళ్లు, కార్లు కొట్టుకుపోతుంటే పట్టించుకోని కేటీఆర్.. నేను టీఆర్ఎస్ కు బ్రాండ్ అంబాసిడర్ అని అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు.. టీఆర్ఎస్ పార్టీ ఇవ్వని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను, దళిత బంధుకు, రైతుల గొంతు వినిపించడానికి, హిందూ సమాజాన్ని కాపాడడానికి నేను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటాను అంటూ ప్రకటించారు బండి సంజయ్.
Also Read
తాజావార్తలు
-
Asia Cup 2026: ఆసియా కప్‌లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్‌తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
-
Rohit Sharma Retirement: హిట్ మ్యాన్ రిటైర్మెంట్ పై బీసీసీఐ కీలక ప్రకటన.. ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ నియామకంపై క్లారిటీ
-
Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
-
Andhra Pradesh: గుడ్‌న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
-
KTR : సాగర్ నీళ్లపై కేటీఆర్ సమరశంఖం.. 10 రోజుల డెడ్‌లైన్..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!