టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్… ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర నిన్న చార్మినార్ దగ్గర ప్రారంభం అయింది. చార్మినార్ దగ్గర ప్రారంభమైన ఈ పాదయాత్ర…. అసెంబ్లీ మీదుగా… నిన్న రాత్రి సమయానికి మెహిదీపట్నం కు చేరుకుంది. నిన్న రాత్రి అక్కడే బస చేసిన బండి సంజయ్… ఇవాళ రెండో రోజు ప్రజా…
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంటి ముందు ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆధ్వర్యంలో మహిళలు ఆందోళనకు దిగారు. కోడిగుడ్లతో దాడి చేసేందుకు యత్నించారు. ఆందోలనకు దిగిన మహిళలను ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. మహిళలను అరెస్ట్ చేసి…పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరో వైపు అదుపులోకి తీసుకున్న మహిళలను విడిచిపెట్టాలని బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇక అటు కార్పొరేటర్ పై దాడికి నిరసనగా మల్కాజ్ గిరి బంద్ కు పిలుపునిచ్చింది బిజెపి పార్టీ.…
పైన పటారం.. లోన లోటారం. తెలంగాణ బీజేపీలో ఇదే పరిస్థితి ఉందట. ఉన్న కొద్దిమంది నేతలూ ఒక్కమాట మీద లేరట. ఢిల్లీ నుంచి వచ్చిన నాయకుడొకరు ఆ సమస్యకే మందు పూసి వెళ్లారట. కూర్చోబెట్టి క్లాస్ తీసుకున్నట్టు టాక్. మరి.. ఆయన మాటలు కమలనాథుల చెవికి ఎక్కాయా? పార్టీ నేతల మధ్య ఉన్న ఇబ్బందేంటి? బీజేపీలో ముఖ్యనేతల మధ్య గ్యాప్ ఉందా? శరీరానికి దెబ్బ తగిలితే మందు రాస్తారు. చికిత్స చేస్తారు. అదే మనసుకు గాయమైతే..? కోలుకోవడానికి…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్… ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.. ఇవాళ ఓబీసీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ సభ్యులతో కలిసి ప్రధాని చెంతకు వెళ్లారు బండి సంజయ్.. జాతీయస్థాయి వైద్య విద్యా కోర్సుల్లో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొంటూ ప్రధానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గత 40 ఏళ్లలో ఏ ప్రభుత్వం తీసుకోని సాహసోపేత…
తెలంగాణ బీజేపీ నేతలు ఇరకాటంలో పడ్డారా? తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం కీలకంగా మారిన గెజిటే దానికి కారణమా? ఏపీ బీజేపీ నేతల పాటనే తెలంగాణ కమలనాథులు పాడుతున్నారా? ఈ యుగళగీతం వెనక ఆంతర్యం ఏంటి? ఇది నష్టమా.. లాభమా? గెజిట్‌పై తెలంగాణ బీజేపీ స్పందించిన తీరు మీద చర్చ! కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌పై తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు స్పందించాయి.…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరుగనుంది. ఈ సమావేశంలో తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తీరును వివరించనున్నారు. read also : వాహనదారులకు ఊరట… ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతంటే ? అయితే……
తెలంగాణ బీజేపీ పార్టీ పాదయాత్రతో ప్రజాక్షేత్రంలో ఉండాలని భావిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇదివరకే ప్రకటించారు. కాగా నేడు మరోసారి బండి సంజయ్ అధ్యక్షతన ఈ విషయమై సమావేశం జరిగింది. ఆగస్టు 9 నుండి ప్రారంభమయ్యే పాదయాత్ర, హుజూరాబాద్ ఎన్నికలు ప్రధాన అంశాలుగా చర్చించారు. పాదయాత్ర లక్ష్యాలు, ఉద్దేశాలను బండి సంజయ్ వివరించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక, నియంత, గడీల పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబపాలనలో…
తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లన్నరేళ్ల సమయం ఉన్నా ఇప్పుడే హీట్ పుట్టింది. అన్ని పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. నేతలు ప్రజల మధ్య ఉండేందుకు, పార్టీ శ్రేణులను యాక్టీవ్ చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. బీజేపీ సారథి కూడా జిల్లాల బాట పట్టారు. వరసగా జిల్లాల పర్యటన చేయాలని డిసైడ్ అయ్యారు. తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు హాట్‌హాట్‌గా మారిపోయాయి. పార్టీ నేతలు జిల్లాల బాట పడుతున్నారు. పోటాపోటీ కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా టైమ్…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. గాంధీ ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అర్ధాంతరంగా తొలగించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యలవల్ల గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న 1700 మంది నర్సులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం రోడ్డెక్కిన ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై లాఠీఛార్జ్ చేసి అరెస్టు చేయడం దారుణమని ఖండించారు. Read Also: ‘విద్యా బాలన్ ఫైరింగ్ రేంజ్’… కాశ్మీర్…