నెల రోజులకు చేరుకున్న బండి సంజయ్ పాదయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నెల రోజులు పూర్తి చేసుకుంది. మరో నాలుగు రోజుల్లో ఆయన మొదటివిడత యాత్ర ముగియనుంది. కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు పాల్గొన్న ఈ యాత్రలో.. స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు సంజయ్. పార్టీ ఎక్కడ బలంగా ఉంది స్థానిక నాయకుల పరిస్థితి ఏంటీ అనే క్లారిటీకి వచ్చారు అవినీతి, నియంతృత్వం, కుటుంబపాలన నుంచి విముక్తి కోసమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగస్ట్ 28న ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారు.
హైదరాబాద్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర హైద్రాబాద్, రంగా రెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల మీదుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చేరుకుంది. ఈ నెల రోజుల్లో రెండు రోజుల బ్రేక్ తప్ప మిగతా అన్ని రోజులు పాదయాత్ర జరిగింది. సెప్టెంబర్ 10 వినాయక చవితి రోజు, సెప్టెంబర్ 17 అమిత్ షా సభ రోజు ఆయన యాత్ర జరగలేదు. ఈ యాత్రలో కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు పాల్గొని ప్రసంగించారు.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వారి ప్రసంగాలు సాగాయి. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, రమణ్‌సింగ్.. ఐదుగురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. సంగ్రామ యాత్రలో భాగంగా ఇప్పటివరకు సుమారు నాలుగు వందల కిలోమీటర్లు నడిచారు బండిసంజయ్. దారి వెంబడి తనను కలిసిన వారితో మాట్లాడుతూ ముందుకు సాగారు. వివిధ వర్గాలవారు.. తమ సమస్యలను సంజయ్ దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆయన పలు అంశాలపై సీఎంకి లేఖ రాశారు. అక్టోబర్ 2తో సంజయ్ మొదటి విడత యాత్ర ముగియనుంది. ఉపఎన్నిక జరగాల్సి ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన ప్రజా సంగ్రామ యాత్రను భారీ రోడ్ షోతో ముగించాలని నిర్ణయించారు. ఈ ముగింపు కార్యక్రమానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!