జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా వీరిద్దరూ చర్చించారు. పవన్‌తో భేటీ అనంతరం మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశానని.. పవన్ కళ్యాణ్ తనను పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. త్వరలో మంచిరోజు చూసి పార్టీలో చేరతాను.. ఒంగోలులోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరుతానని చెప్పారు.
కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ కానున్నారు. నోవాటెల్ నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి బాలినేని బయలుదేరారు. పవన్‌తో భేటీ అనంతరం లాంఛనంగా జనసేన పార్టీలో చేరే విషయాన్ని బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రకటించనున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అడుగులు జనసేన పార్టీ వైపు పడుతున్నాయి.. ఇప్పటికే తన రాజీనామా లేఖలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి పంపిన బాలినేని.. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు.. ఇక, జనసేన పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లారు బాలినేని.. ఇక, ఈ రోజు విజయవాడలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారు బాలినేని.. ఇప్పటికే జనసేన కీలక నేత నాగబాబుతో మంతనాలు…
విజయవాడలో గురువారం రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలుస్తానని బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. తన భవిష్యత్ కార్యాచరణను కూడా అక్కడే ప్రకటిస్తానన్నారు. గతంలో తాను పార్టీలోని కొందరు వ్యక్తుల వల్ల పడుతున్న ఇబ్బందులు పలు సందర్బాల్లో ప్రస్తావించిన బాలినేని.. పార్టీలో తనకు జరిగిన అన్యాయాలను త్వరలో వివరిస్తానని తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అడుగులు జనసేన పార్టీ వైపు పడుతున్నాయి.. ఇప్పటికే తన రాజీనామా లేఖలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి పంపిన బాలినేని.. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు.. ఇక, జనసేన పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లారట బాలినేని.. రేపు విజయవాడలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారట బాలినేని..
వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు.. బంధువు అయిన.. కీలక నేత.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం పార్టీని వీడారు.. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాసిన బాలినేని.. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది.. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. వైసీపీకి గుడ్‌బై చెప్పారు..
వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం కాకరేపుతున్నాయి. హైదరాబాద్ లో మకాం వేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. వైసీపీకి బాలినేని రాజీనామా చేస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. రెండు రోజుల క్రితం పార్టీ అధినేత జగన్ తో బాలినేని శ్రీనివాస రెడ్డి సమావేశమయ్యారు.
వైసీపీలో ఒంగోలు వార్ మొదలైందా? జిల్లా అధ్యక్ష పదవి విషయంలో స్థానిక నేతలు గరం గరంగా ఉన్నారా? మమ్మల్ని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటే… ఆ తర్వాత మీ ఇష్టం అంటూ అధిష్టానానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారా? ఇంతకీ ఒంగోలులో ఏం జరుగుతోంది? స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నది ఎవర్ని? జిల్లా అధ్యక్ష పదవి చుట్టూ ముసురుకుంటున్న ముసలం ఏంటి? ఏపీలో వైసీపీకి పట్టున్న జిల్లాల్లో ప్రకాశం కూడా ఒకటి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి జిల్లాలో చెప్పుకోదగ్గ స్దానాలే…