Balineni Srinivasa Reddy resigns from YCP: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది.. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. వైసీపీకి గుడ్‌బై చెప్పారు.. ఈ మధ్యే పార్టీ అధినేత వైఎస్ జగన్‌తో సమావేశమైన బాలినేని.. కీలక చర్చలు జరిపారు.. అయితే, ఆ చర్చలు విఫలమయ్యాయంటూ వార్తలు వినిపించాయి.. అంతేకాదు సమావేశం మధ్యలోనే అసంతృప్తితో బాలినేని బయటికి వెళ్లిపోయినట్లు ప్రచారం సాగింది.. కొంతకాలంగా వైసీపీ తనకు సహకరించడంలేదని చెబుతూ వస్తున్న బాలినేని.. ఈ రోజు పార్టీకి గుడ్‌బై చెప్పారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.. తన రాజీనామా లేఖకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి పంపించారు.. ఈవీఎంలపై తాను చేస్తోన్న పోరాటానికి.. వైసీపీ నుంచి సహకారం లేదని అసంతృప్తితో ఉన్నారట..
Read Also: Kolkata: వైద్యురాలి హత్యాచార కేసులో బెంగాల్ పోలీసులపై సీబీఐ సంచలన ఆరోపణలు
కాగా.. వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం గత కొంతకాలంగా కాకరేపుతూ వచ్చింది.. హైదరాబాద్ లో మకాం వేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లతో సమావేశం కావడంతో.. వైసీపీకి బాలినేని రాజీనామా చేస్తారనే ప్రచారం మరింత ఊపదుకుంది.. ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలంటూ బాలినేనిని వైఎస్ జగన్ కోరగా.. అందుకు ఆయన తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయన జనసేనలో చేరతారనే ఊహాగానాలు కూడా వచ్చాయి.. మరోవైపు.. భవిష్యత్ కార్యాచరణపై కార్పొరేటర్లు, అనుచరులతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమావేశమై చర్చించారు. అనంతరం.. బాలినేనితో చర్చించేందుకు మాజీ మంత్రి విడుదల రజిని, వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిని వైసీపీ అధిష్టానం రంగంలోకి దించినా ఊపయోగం లేకుండా పోయింది.. చివరకు ఆయనకు వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు..