Janasena Vs TDP Flex War: జనసేన వర్సెస్ టీడీపీ..! ఒంగోలులో ఫ్లెక్సీల రగడ
- ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫ్లెక్సీ రగడ..
- బాలినేనిని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు..
- ఫ్లెక్సీలో జనసేన నేతలతో పాటు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల ఫొటోలు..
- ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలు పెట్టడంపై టీడీపీ అభ్యంతరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena Vs TDP Flex War: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫ్లెక్సీ రగడ మొదలైంది.. ఒంగోలు చర్చి సెంటర్ లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలోకి ఆహ్వానిస్తూ కొందరు ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. అయితే, వాళ్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జనసేన నేతలతో పాటు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలు పెట్టారు.. బాలినేని ఫోటోలతో పాటు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలు కలిపి పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ కార్యకర్తలు.. ఆ ఫ్లెక్సీలను తొలగించారు.. బాలినేని వంటి నేతలు గతంలో తమను ఇబ్బందులు పెట్టి ఇప్పుడు జనసేనకు వస్తున్నారని ఆరోపించారు.. బాలినేని పార్టీ మార్పు వ్యవహారంలో తమ నేతల అనుమతి తీసుకోకుండా ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎన్నికలకు ముందు జనసేనలోకి వచ్చిన వారిని స్వాగతిస్తామని.. ఇప్పుడు వచ్చే వారు మీ ఇష్టానుసారం చేయాలని చూస్తే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు టీడీపీ నేతలు.
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
కాగా, ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న బాలినేని వ్యక్తిగత కారణాలు, అంతర్గత విభేదాలతో పార్టీని వీడుతున్నట్లు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు.. రాజకీయాలు వేరు.. బంధుదుత్వాలు వేరంటూ లేఖలో ఘటు వ్యాఖ్యలు చేసిన బాలినేని మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు… ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరటంతో ఆయన చేరికకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.. దీంతో ఆయన దాదాపుగా వచ్చే 4వ తేదీన ఒంగోలులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి తన అనుచరులతో పాటు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు..
తాజావార్తలు
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..