సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి చారిత్రక విజయం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ జంటగా సాత్విక్-చిరాగ్ జోడీ కూడా బంగారు పతకాన్ని గెలుచుకున్నారు.
PV Sindhu : భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కాస్త రూటు మార్చారు. ఆటతోనే కాకుండా తన డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేశారు. సాధారణంగా షటిల్ కోర్టులోనే కాకుండా బయట కూడా చాలా చురుగ్గా ఉంటుంది. ఎప్పుడూ చలాకీగా కనిపించే సింధు..ఈ కాలం అమ్మాయిలా ట్రెండ్ ను ఫాలో అవుతుంది. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉండే ఈ తెలుగమ్మాయి తాజాగా ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్…
BWF Championship 2022: వయసుతో ఆటకు సంబంధం లేదని మరోసారి రుజువైంది. ఇప్పటికే వయసు మళ్లిన వారు పలు క్రీడలలో రాణిస్తూ ఈ విషయాన్ని చాటిచెప్తున్నారు. తాజాగా ఓ మహిళ తన కుమారుడితో కలిసి చరిత్ర సృష్టించింది. టోక్యో వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్ 2022లో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.ఇజ్రాయెల్‌కు చెందిన స్వెత్లానా అనే 64 ఏళ్ల మహిళ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తొలి విజయాన్ని నమోదు చేసింది. BWF చరిత్రలో ఓ…
కామన్వెల్త్ గేమ్స్-2022లో చివరి రోజు భారత్ పతకాల పంట పండించింది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో లక్ష్యసేన్, మహిళల సింగిల్స్‌లో సింధు స్వర్ణ పతకాలు సాధించగా.. తాజాగా పురుషుల డబుల్స్ విభాగంలోనూ భారత్ మరో స్వర్ణం అందుకుంది
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ బంగారు పతకాన్ని సాధించాడు.
కామన్వెల్త్ క్రీడలు చివరి దశకు చేరుకున్నాయి. ఇవాళ్టితో ఆ క్రీడలు ముగియనుండగా.. భారత క్రీడాకారులు మాత్రం అదరగొడుతున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్వర్ణం సాధించింది.కెనడాకు చెందిన మిచెల్ లీతో మహిళల సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.
కామన్వెల్త్ క్రీడల్లో మంగళవారం భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణ పతకాలు, రెండు రజత పతకాలు వచ్చి చేరాయి. భారత అథ్లెట్లు మంగళవారం కామన్వెల్త్ క్రీడల్లో పసిడి మోత మోగించారు. అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన అమ్మాయిలు లాన్‌బౌల్స్ ఫోర్స్ విభాగంలో చారిత్రాత్మక విజయంతో తొలి స్వర్ణాన్ని అందించారు.
సింగపూర్ ఓపెన్-2022 టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత షట్లర్ పీవీ సింధును ప్రధాని మోదీ అభినందించారు.భారత షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సింగపూర్ ఓపెన్ 2022 టైటిల్‌ను మహిళల సింగిల్స్ విభాగంలో చైనాకు చెందిన వాంగ్ జియీని ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. సింగపూర్ ఓపెన్-2022 విజేతగా నిలిచింది. ఆదివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్ ఫైనల్స్‌లో చైనా ప్లేయర్ వాంగ్ జి యీని 21-9, 11-21, 21-15 తేడాతో పీవీ సింధు ఓడించింది. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. ప్రారంభసెట్‌ను సింధు 12 నిమిషాల్లోనే ముగించింది. దీంతో 21-9తో తొలి సెట్‌ను సింధు గెలవగా రెండో సెట్‌ను 21-11 తేడాతో వాంగ్ జి యీ గెలిచింది. దీంతో మూడో సెట్లో…