China Badminton Player Death: బ్యాడ్మింటన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం చైనా షట్లర్ జాంగ్ జిజీ గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలిపోయాడు. 17 ఏళ్ల జాంగ్ జిజీని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా.. ఫలితం లేకుండా పోయింది. ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో చైనా క్రీడా ప్రపంచం శోక సముద్రంలో మునిగిపోయింది. Also Read: Abhay Verma: నేను అబ్బాయిని అని చెప్పినా.. కుర్రాళ్లు వదల్లేదు: హీరో ఆదివారం…
Sai Praneeth announces retirement from badminton: భారత షట్లర్ బీ సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని 31 ఏళ్ల ప్రణీత్ ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. గత కొణతకాలంగా ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. తన సుదీర్ఘ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. అమెరికాలో ఒక క్లబ్‌కు సేవలు అందించబోతున్నట్లు తన ప్రణీత్ వివరించాడు. ‘డియర్ బ్యాడ్మింటన్ థాంక్యూ. బ్యాడ్మింటన్‌తో…
సినిమాల్లో నటించే చాలా మందికి చాలా రకాల టాలెంట్ లు ఉంటాయి.. అందులో ఎక్కువ మంది క్రీడా రంగంలో రానిస్తున్నారు.. ఇటీవల తెలుగు సినీ నటి ప్రగతి వెయిట్ లిఫ్టింగ్ లో పథకాన్ని సాధించిన విషయం తెలిసిందే.. సౌత్ ఇండియా చాంప్ గా సిల్వర్ మెడల్ గెలుచుకుంది. తాజాగా ఓ హీరోయిన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా కప్పు సాధించింది.. ఆ హీరోయిన్ ఎవరా అని అనుకుంటున్నారా? మరెవ్వరో కాదండి నివేదా పేతురాజ్.. ఈ అమ్మడు గురించి ప్రత్యేక…
Satwiksairaj Says My Goal is to win a medal in Olympics: చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడలు 2023లో మెడల్స్ సాధించిన బాడ్మింటన్ ప్లేయర్స్‌ని కోచ్ పుల్లెల గోపీచంద్ సన్మానించారు. గచ్చిబౌలి బ్యాడ్మింటన్ అకాడమీలో సాత్విక్ సాయిరాజ్, హెచ్ఎస్ ప్రణయ్‌లను ఘనంగా సన్మానించారు. భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించారు. మరోవైపు షట్లర్ ప్రణయ్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన విషయం…
ఆసియా క్రీడల్లో భారత్ ఎప్పటికప్పుడు కొత్త చరిత్ర సృష్టిస్తూనే ఉంది. ఆసియా క్రీడల్లో 14వ రోజు కూడా భారత్ పతకాల పరంపరను కొనసాగించింది. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్‌కు చెందిన సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టిలు దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించి రికార్డు సృష్టించారు. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్ తొలిసారి స్వర్ణం సాధించింది.
దాణా కుంభకోణం కేసులో వైద్య కారణాలతో బెయిల్ పొందిన ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ బ్యాడ్మింటన్ ఆడుతున్నారని, బీహార్ మాజీ ముఖ్యమంత్రికి మంజూరైన ఉపశమనాన్ని రద్దు చేయాలని కోరుతూ సీబీఐ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
కెనడా ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ లక్ష్య సేన్ ఫైనల్ కు చేరుకున్నాడు. జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటోపై వరుస గేమ్‌లతో విజయం సాధించి ఈ ఘనత సాధించాడు. మరోవైపు ప్రపంచ నం.1 క్రీడాకారిణి అకానె యమగుచి సెమీఫైనల్లో పీవీ సింధును ఓడించింది. మహిళల సింగిల్స్ సెమీ-ఫైనల్స్‌లో జపాన్ నంబర్ వన్ అకానె యమగుచి చేతిలో 14-21, 15-21 తేడాతో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఓడిపోయింది.
బ్యాడ్మింటన్‌లో సాత్విక్-చిరాగ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇండోనేషియా ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించారు. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను భారత్‌కు చెందిన సాత్విక్-చిరాగ్ జోడి కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ విజృంభణతో వరుస గేమ్‌లలో మలేషియా జోడీని ఓడించారు.
రెండుసార్లు ఒలింపిక్ విజేత పివి సింధు గురువారం ఇండోనేషియా ఓపెన్ 2023 నుంచి చైనీస్ తైపీకి చెందిన తాయ్ జు-యింగ్‌తో వరుస గేమ్‌లలో ఓడిపోయి నిష్క్రమించింది. రౌండ్ ఆఫ్ 16లో తాయ్ జు యింగ్‌పై సింధు 18-21, 16-21 తేడాతో పరాజయం పాలైంది.
బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్స్ 2023 కోసం భారత జూనియర్ జట్టును ప్రకటించింది. జూలై 7 నుండి 16 వరకు ఇండోనేషియాలోని యోగ్యకార్తాలో కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌లు జరుగనున్నాయి. జట్టులో కీలకంగా ఉన్న తారా షా మరియు ఆయుష్ శెట్టి ఛాంపియన్ షిప్ లో పాల్గొననున్నారు.