Saina Nehwal Hints at Reunion with Parupalli Kashyap After Divorce: బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ జంట విడిపోయిన విషయం తెలిసిందే. భర్త పారుపల్లి కశ్యప్‌తో తాను విడిపోతున్నట్లు జులై 13న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా సైనా ప్రకటించారు. అయితే నెల కూడా కాకముందే సైనా అభిమానులకు ఓ శుభవార్త చెప్పారు. కశ్యప్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి.. దూరం దగ్గర చేసింది అని క్యాప్షన్ ఇచ్చారు. తాము మరలా…
ఇండియా ఓపెన్ ప్రపంచ సూపర్ 750 టోర్నీ ఢిల్లీ వేదికగా జనవరి 14 నుంచి 19 వరకు జరగనుంది. ఈ టోర్నీలో భారత స్టార్ షట్లర్, కొత్త పెళ్లి కూతురు పీవీ సింధు పాల్గొననున్నారు. వివాహం తర్వాత సింధు పాల్గొనే తొలి టోర్నీ ఇదే. గతేడాది చివర్లో ఉదయ్‌పూర్‌లో వెంకట దత్త సాయితో సింధు వివాహం జరిగిన విషయం తెలిసిందే. 2025 సీజన్‌ను త్వరగా ఆరంభించేందుకే డిసెంబర్‌లో తాను వివాహం చేసుకున్నానని ఒలింపిక్ విజేత చెప్పారు. టోర్నీ…
మంత్రి శ్రీధర్ బాబుకు మరో కీలక బాధ్యత వరించింది. ‘తెలంగాణా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ’ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు నియమితులయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు పుల్లెల గోపిచంద్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణను క్రీడలకు హబ్ గా మారుస్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణను క్రీడలకు హబ్ గా మార్చాలని కంకణం కట్టుకున్నారని తెలిపారు.
ఇన్నాళ్లూ రాకెట్ పట్టి మైదానంలో ప్రత్యర్థులను హడలెత్తించిన భారత స్టార్ పీవీ సింధు.. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో సింధు వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్‌లో ఆదివారం రాత్రి 11.20కి మూడుముళ్ల బంధంతో సింధు, సాయి ఒక్కటయ్యారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ప్రత్యేక అతిథులు మాత్రమే హాజరయ్యారు. కొత్త జంటకు ప్రముఖులు, ఫాన్స్, నెటిజన్లు…
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. సోమవారం జరిగిన పారాలింపిక్స్‌లో భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీశ్ కుమార్ అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
Lakshya Sen Paris Olympics 2024: 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత షట్లర్ లక్ష్య సేన్ కాంస్య పతకాన్ని గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు. 22 ఏళ్ల బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ కాంస్య పతక పోరులో మలేషియా ఏడో సీడ్ లీ జి జియాతో 21-12, 16-21, 11-21 తేడాతో ఓడిపోయాడు. సైనా నెహ్వాల్, పివి సింధు బ్యాడ్మింటన్ లో భారతదేశం నుండి ఒలింపిక్ పతకాలు సాధించిన విజేతలుగా మిగిలిపోయారు. మ్యాచ్ మొదట్లో సేన్ కొన్ని అద్భుతమైన ర్యాలీలతో…
Lakshya Sen: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి భారతీయ పురుష బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ 3 కాంస్య పతకాలు సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో మను భాకర్ తొలి పతకం సాధించింది. దీని తర్వాత, ఆమె సరబ్జోత్ సింగ్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్‌లో కాంస్య పతకాన్ని గెలిచింది. అలాగే స్వప్నిల్ కుసాలే 50…
భారత యువ బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 22 ఏళ్ల లక్ష్య సేన్ ఈ మ్యాచ్‌లో 32 ఏళ్ల స్వదేశీయుడు హెచ్‌ఎస్ ప్రణయ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో ఎన్నో పతకాశలతో వెళ్లిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమి చవిచూసింది.