సినిమాల్లో నటించే చాలా మందికి చాలా రకాల టాలెంట్ లు ఉంటాయి.. అందులో ఎక్కువ మంది క్రీడా రంగంలో రానిస్తున్నారు.. ఇటీవల తెలుగు సినీ నటి ప్రగతి వెయిట్ లిఫ్టింగ్ లో పథకాన్ని సాధించిన విషయం తెలిసిందే.. సౌత్ ఇండియా చాంప్ గా సిల్వర్ మెడల్ గెలుచుకుంది. తాజాగా ఓ హీరోయిన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా కప్పు సాధించింది.. ఆ హీరోయిన్ ఎవరా అని అనుకుంటున్నారా? మరెవ్వరో కాదండి నివేదా పేతురాజ్.. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..
ఈమె మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, రెడ్, పాగల్, అలవైకుంఠపురంలో, దాస్ కా ధమ్కీ.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలతో నివేదా పేతురేజ్ తెలుగులో మంచి ఫామ్ లో ఉంది. వేరే భాషల్లో కూడా సినిమాలు చేస్తూ సౌత్ లో అభిమానులని బాగానే సంపాదించుకుంది నివేదా. నివేదా ఆల్రెడీ F1 కార్ రేసర్. ఫార్ములా కార్ రేసింగ్ లో ఎన్నో పథకాలను సాధించింది.. ఇప్పుడు బ్యాడ్మింటన్ లో కప్పు సాధించి అందరిని అవాక్కయేలా చేసింది..
తాజాగా తమిళనాడులో జరిగిన స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో మధురై తరపున డబుల్స్ ఆడి విన్నర్ గా నిలిచింది. తనకి వచ్చిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ కప్ తో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ విషయాన్ని తెలిపింది నివేదా. దీంతో అంతా నివేదాకు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఆల్రెడీ హీరోయిన్ గా దూసుకుపోతుంది.. మొన్న కార్ రేసింగ్.. నేడు బ్యాడ్మింటన్ ఛాంపియన్.. ఇంకా ఈ అమ్మడులో ఎన్ని ట్యాలెంట్స్ ఉన్నాయో చూడాలి..