మంత్రి శ్రీధర్ బాబుకు మరో కీలక బాధ్యత వరించింది. ‘తెలంగాణా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ’ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు నియమితులయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు పుల్లెల గోపిచంద్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణను క్రీడలకు హబ్ గా మారుస్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణను క్రీడలకు హబ్ గా మార్చాలని కంకణం కట్టుకున్నారని తెలిపారు.
READ MORE: Andhra Pradesh: ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు.. జీవో జారీ
దక్షిణ కొరియాలోని ఒక చిన్న స్పోర్ట్స్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఇటీవల జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో 37 పతకాలు సాధించారని గుర్తు చేశారు. ఈ స్ఫూర్తితోనే తెలంగాణలోనూ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. అకడమిక్స్, గేమ్స్ ను మిళితం చేస్తూ విద్యార్థి వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చి దిద్దుతామని.. వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు స్పోర్ట్స్ పాలసీకి రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియలో విద్యావేత్తలు, ప్రముఖ క్రీడాకారులను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటాలన్నదే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని వివరించారు. కాగా.. ఇప్పటి వరకు ఈ పదవిలో కేటీఆర్ ఉన్నారు. 2026 వరకు తన పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన హఠాత్తుగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు.
READ MORE: Mutton Paya Soup Recipe: మటన్ పాయా సూప్ తయారీ విధానం.. దీంతో ఎన్ని లాభాలంటే?