Babar Azam React on His Captaincy Ahead of ENG vs PAK Match: వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ వైఫల్యంపై వస్తున్న విమర్శలపై కెప్టెన్ బాబర్ ఆజామ్ స్పందించాడు. టీవీలో మాటలు చెప్పడం చాలా సులువని పాక్ మాజీలకు చురకలు అంటించాడు. నాయకత్వ భారం తన బ్యాటింగ్‌పై ఎలాంటి ప్రభావం చేపలేదని స్పష్టం చేశాడు. ప్రపంచకప్ 2023 పాకిస్థాన్‌కు వెళ్లిన తర్వాత తన కెప్టెన్సీ విషయంలో ఏం జరుగుతుందో తెలియదని బాబర్ పేర్కొన్నాడు. అఫ్గానిస్తాన్…
బంగ్లాదేశ్‌తో మ్యాచ్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ సెమీస్ ఆశలు ఇంకా సజీవంగా మిగిలి ఉన్నాయి. అటు పాయింట్ల పట్టికలో పాకిస్తాన్.. 5వ స్థానానికి ఎగబాకింది. పాక్ 7 మ్యాచ్‌ల్లో 3 గెలువగా.. నాలుగింటిలో ఓడిపోయింది. అయితే.. ఈ విక్టరీ తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తన స్పందనను తెలిపాడు. ప్రపంచకప్‌లో రాబోయే మ్యాచ్‌లలో తమ జట్టు వ్యూహం గురించి చెప్పాడు.
Babar Azam Private Whatsapp Chat Leaked: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన పాకిస్థాన్.. పేలవమైన ప్రదర్శన చేస్తోంది. మెగా టోర్నీలో పాక్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి.. రెండింటిలోనే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న పాక్.. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. బాబర్ అజామ్ కెప్టెన్‌గా, ఆటగాడిగా విఫలం అవుతుతుండడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వరుసగా విఫలమవుతున్న బాబర్‌పై పెద్ద…
Pakistan Captain Babar Azam react on Defeat vs South Africa: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శుక్రవారం ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై పాకిస్తాన్ ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది. 271 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 47.2 ఓవర్లలో ఛేదించింది. ఐడెన్ మార్క్రమ్ (91; 93 బంతుల్లో 7×4, 3×6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. సాద్…
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్లో సెమీ-ఫైనల్‌కు చేరుకోవడంలో జట్టు విఫలమైతే బాబర్ అజామ్ కెప్టెన్సీకి ప్రమాదం వాటిల్లుతుందని సూచిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఒక విచిత్రమైన ప్రకటనను విడుదల చేసింది. పాకిస్థాన్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ 2023లో ఇండియా, ఆస్ట్రేలియ, అఫ్గానిస్తాన్‌లతో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది.
చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో ఆఫ్గాన్ చిత్తుగా ఓడించింది. ప్రపంచకప్ ముగిసిన వెంటనే పాక్ టీమ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌కు ముందే పాకిస్తాన్ టీమ్ కు కొత్త కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది.
నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ ఘోర పరాజయం చవిచూసింది. 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. అటు బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ ఆఫ్ఘాన్ ఆలౌరౌండ్ ప్రదర్శన చూపించింది. దీంతో సూపర్ విక్టరీని అందుకుంది. ఇదిలా ఉంటే.. తమ జట్టు ఓటమిపై కెప్టెన్ బాబర్ ఆజం స్పందించారు.
Wasim Akram Fires on Babar Azam for shirt swap with Virat Kohli: శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కలిసి మాట్లాడాడు. ఆపై బాబర్ కోరిక మేరకు కోహ్లీ తాను సంతకం పెట్టిన జెర్సీని పాక్ కెప్టెన్‌కు గిప్ట్గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన…
2023వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆశించినంత ప్రదర్శన చూపించడం లేదు. ఆడిన రెండు మ్యాచ్ ల్లో సింగిల్ డిజిట్ కే ఔటయ్యాడు. ఈ క్రమంలో బాబర్ ఆజం ఫామ్‌పై పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ఆజం మరోసారి ఫ్లాప్ అయ్యాడని అన్నాడు. బాబర్ ఆజం విఫలమైనప్పటికీ.. మంచి ఫాంలో ఉన్న ఆటగాడు మరొకరు దొరికాడని తెలిపాడు.