IPL 2024: కోహ్లీతో కలిసి బాబర్ ఆడితే.. పాక్ అభిమానికి హర్భజన్ కౌంటర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harbhajan Singh Counter Pakistan Fan Over IPL 2024: భారత టీ20 టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దాయాది పాకిస్థాన్‌లో కూడా ఐపీఎల్‌కు ఫాన్స్ ఉన్నారు. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్‌తో సమానంగా ఐపీఎల్‌ని వీక్షిస్తుంటారు. అయితే భారత టీ20 లీగ్‌లో పాకిస్థాన్ ప్లేయర్లకు ఎంట్రీ లేని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో పాకిస్థాన్ ప్లేయర్లు ఆడితే బాగుంటుందని ఓ పాక్ అభిమాని తన మనసులోని కోరికను సోషల్ మీడియాలో బయటపెట్టాడు. పాక్ ఆటగాళ్లు భారత టీ20 టోర్నీలో ఆడితే చూడాలనుందని అతడు పేర్కొన్నాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)లో విరాట్ కోహ్లీతో పాటు బాబర్ అజామ్ ఆడితే చూడాలని ఉందని పాక్ అభిమాని ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. అంతేకాదు షాహిన్ అఫ్రిదీ, జస్ప్రీత్ బుమ్రా కలిసి ముంబై ఇండియన్స్‌కు ఆడాలని.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎంఎస్ ధోనీతో మొహ్మద్ రిజ్వాన్ ఉంటే బాగుంటుందని తన కోరికల చిట్టాను వివరించాడు. ఇది భారత్, పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల కల అంటూ పలు జెర్సీల్లో క్రియేట్ చేసిన ఫొటోలను పంచుకున్నాడు.
Also Read
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
Also Read: RCB vs MI: స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం అద్భుతం: ఎలీస్ పెర్రీ
పాక్ అభిమాని ట్వీటుకు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. ‘భారతీయులెవరికీ అలాంటి కల లేదు. ముందుగా మీరు కలలు కనడం ఆపండి. మేల్కొనండి బాయ్స్’ అంటూ హర్భజన్ పాక్ అభిమానికి కౌంటర్ ఇచ్చాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలి సీజన్ (2008)లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పాక్ ఆటగాళ్లపై ఐపీఎల్‌లో ఆడకుండా నిషేధం విధించారు. ఐపీఎల్ 2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!