ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షన జరిగిన సమావేశంలో.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.. రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య ధీమాను కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఆయుష్మాన్ భారత్ - ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది.. ఏడాది ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
Rain Alert : గత నాలుగు ఐదు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో యూసఫ్‌గూడ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీలలో వరదలు ముంచెత్తి వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఉప్పల్, ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. పంజాగుట్ట, బేగంపేట, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో రహదారులపై…
Kishan Reddy : మోడీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల చాలా మంది తెలియకుండానే అనారోగ్యానికి గురవుతున్నారని, ప్రతి 100 మందిలో 95 మంది డాక్టర్లను సంప్రదించాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి ఉప్పల్ పారిశ్రామిక వాడలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన తెలంగాణ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్…
మోడీ ప్రభుత్వ ప్రధాన పథకాల్లో ఒకటైన ఆయుష్మాన్ భారత్ యోజనలో పెద్ద మోసం బయటపడింది. ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన రూ. 562.4 కోట్ల విలువైన 2.7 లక్షల నకిలీ క్లెయిమ్‌లను నేషనల్ యాంటీ-ఫ్రాడ్ యూనిట్ గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. మొత్తం 1,114 ఆసుపత్రులను ప్యానెల్ నుంచి తొలగించారు. దీనితో పాటు, ఆయుష్మాన్ భారత్ - ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (AB-PMJAY) కింద 549 ఆసుపత్రులను నిలిపివేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ, ఆరోగ్యశ్రీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో బీపీఎల్‌లో ఉన్న కోటి 40 లక్షలకు పైగా కుటుంబాలకు బీమా చేయించి వైద్య సేవలు అందించనుంది ప్రభుత్వం.. హైబ్రిడ్ ఇన్సూరెన్స్ విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు మంత్రి సత్యకుమార్..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వృద్ధులకు దీపావళి బహుమతి అందించారు. 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఏటా రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా సదుపాయాన్ని ప్రవేశ పెట్టారు. ‘ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన’ (PMJAY) కింద తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు.
70 ఏళ్లు, ఆపై వయసున్నవారికి ఆయుష్మాన్ భారత్ వర్తింపజేయనున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రయోజనాలు కల్పించడంలో భాగంగా అర్హులైన వారి పేర్లను నమోదు ప్రక్రియను చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీనియర్ సిటిజన్లను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
Ayushman Bharat: 70 ఏళ్లు పైబడిన వారందరినీ తన పరిధిలోకి తీసుకురావాలని, బీమా కవరేజీని ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని ప్రభుత్వం ప్రాథమికంగా ఆలోచిస్తోంది.