మోడీ ప్రభుత్వ ప్రధాన పథకాల్లో ఒకటైన ఆయుష్మాన్ భారత్ యోజనలో పెద్ద మోసం బయటపడింది. ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన రూ. 562.4 కోట్ల విలువైన 2.7 లక్షల నకిలీ క్లెయిమ్‌లను నేషనల్ యాంటీ-ఫ్రాడ్ యూనిట్ గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. మొత్తం 1,114 ఆసుపత్రులను ప్యానెల్ నుంచి తొలగించారు. దీనితో పాటు, ఆయుష్మాన్ భారత్ – ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (AB-PMJAY) కింద 549 ఆసుపత్రులను నిలిపివేశారు.
REDA MORE: Jammu Kashmir: భారత్-పాక్ సరిహద్దుల్లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు భారత జవాన్లు మరణం..
రాజ్యసభలో “ఆయుష్మాన్ పథకం కింద ప్రైవేట్ ఆసుపత్రులు నకిలీ బిల్లులు తయారు చేసిన కేసులు వెలుగులోకి వచ్చాయా?” అనే ప్రశ్న ప్రభుత్వానికి సంధించారు. రాష్ట్రాలు, ఆసుపత్రుల వారీగా వివరాలు అడిగారు. నకిలీ బిల్లులు తయారు చేస్తున్న ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అని ప్రశ్నించారు. దీనికి ప్రతిస్పందనగా, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సమాచారం ఇచ్చింది. ఆయుష్మాన్ యోజన ప్రభుత్వ ప్రధాన పథకం అని ప్రభుత్వం తెలిపింది.
REDA MORE: Tata Safari Classic 2025: తక్కువ ధరకే టాటా సఫారీ-7 సీటర్.. ప్రత్యేకత ఏంటంటే?
“ఈ పథకం కింద 12.37 కోట్ల కుటుంబాలకు చెందిన దాదాపు 55 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం రూ. 5 లక్షల ఆరోగ్య సంరక్షణ పొందుతున్నారు. ఈ పథకంలో మోసాలను నివారించడానికి, గుర్తించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. జాతీయ ఆరోగ్య అథారిటీ (NHA)లో జాతీయ మోస నిరోధక విభాగం (NAFU) ఏర్పాటు చేశాం. ఈ విభాగం నకిలీ క్లెయిమ్‌లను కనుగొంటుంది. ఇప్పటి వరకు 6.66 కోట్ల క్లెయిమ్‌లలో ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన 2.7 లక్షల క్లెయిమ్‌లు నకిలీవని ఎన్‌ఏఎఫ్ గుర్తించింది. రూ. 562.4 కోట్లు నకిలీ బిల్లులను తిరస్కరించింది.” అని ఆ శాఖ సమాధానమిచ్చింది.