Minister Prashant Reddy criticizes Nirmala Sitharaman's comments: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఆమెపై తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు. హరీష్ రావు ఛాలెంజ్ కి భయపడే నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకుందని ఎద్దేవా చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిర్మాల సీతారామన్ హయాంలో రూపాయి విలువ విపరీతంగా పడిపోతుందని అన్నారు. కేసీఆర్ ను చూసి బీజేపీ వణికిపోతోందని అన్నారు. కేసీఆర్…
భారత పౌరులందరికీ 5 లక్షల రూపాయల ఉచితఆరోగ్య బీమా అందిస్తోంది కేంద్రప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పథకం ఇప్పుడు ABHA హెల్త్ కార్డుగా మార్చబడింది. వెబ్ సైట్ ఓపెన్ అయింది.ఇందులో రిజిస్టర్ అయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఐదు లక్షల రూపాయల ఆయుష్మాన్ ABHA హెల్త్ కార్డ్ లభిస్తుంది. 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పొందవచ్చు. ఇందులో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు టైప్ చేసి…
భారత ప్రభుత్వం ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఆరోగ్య మేళాలను నిర్వహిస్తుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దేశమంతా మండలి స్థాయిలో ఆరోగ్య మేళాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ సదుపాయాలను వినియోగించుకోకుండా ప్రజలు ప్రయివేటు ఆసుపత్రికి వెళుతున్నారు. ధనిక, పేద అనే తేడా లేకుండా కేంద్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇస్తుందన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ లో హెల్త్ మేళాను ప్రారంభించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరయ్యారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్…
వైద్య వృత్తి కష్టమైనా డిప్రెషన్ కి గురికావద్దని వైద్యవిద్యార్ధులకు సూచించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. బీబీనగర్ ఎయిమ్స్ లో 2021 – 2022 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థులకు వైట్ కోట్ సెరిమోనీ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వైద్యవిద్యార్ధులకు హితోపదేశం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా అన్నారు గవర్నర్. ఆయుష్‌మాన్ భారత్, జన ఔషధి పథకాలను సద్వినియోగం పరుచుకోవాలన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ తెలంగాణ గౌరవ చిహ్నం అన్నారు.…
తెలంగాణలో త్వరలోనే ఆయుష్మాన్ భారత్ అమలు కానుంది. ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్ భారత్ పేరుతో అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది ప్రభుత్వం. రెండు స్కీంలు కలయికతో వచ్చే సమస్యలు, సాధ్యసాధ్యాలపై ప్రభుత్వ కసరత్తు చేస్తుంది. అన్నీ ఒకే అయితే ఈ వారంలో అధికారిక ప్రకటన రానుంది. కరోనాతో పాటు అనేక వ్యాధులకు చికిత్స ఇందులోనే ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఆరోగ్యశ్రీలో లేని 685 చికిత్సలు అయుష్మాన్ ద్వారా అనుసంధానం కానున్నాయి. దేశంలో ఎక్కడైనా చికిత్స చేయించుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఆయుష్మాన్ భారత్…
కరోనా కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో ఎక్కువగా ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి ఎక్కువగా వినిపించిన మాట.. కోవిడ్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని.. ఇక, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ రాగా.. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తోన్న ప్రభుత్వం.. ఇప్పుడు కోవిడ్ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్ భారత్ పేరిట ఈ పథకం అమలు చేయనున్నారు.. తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద…
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదంటూ ఎప్పటి నుంచి విమర్శలు ఉన్నాయి.. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్‌ను టార్గెట్ చేశారు బీజేపీ నేతలు.. అసలు ఆయుష్మాన్ భారత్ అమలు చేయడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి? అంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ఉత్తర్వులు జారీ చేసింది…