Rain Alert : కొన్ని గంటల్లో కుండపోత.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక
- హైదరాబాద్‌లో కుండపోత.. రోడ్లపై నిలిచిపోయిన నీరు
- బంగాళాఖాతం ప్రభావం.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాల హెచ్చరిక
- పలు జిల్లాల్లో అతిభారీ వర్షాల సూచన
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Alert : గత నాలుగు ఐదు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో యూసఫ్‌గూడ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీలలో వరదలు ముంచెత్తి వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి.
ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఉప్పల్, ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. పంజాగుట్ట, బేగంపేట, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండి, లోతట్టు ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తోంది.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
కొత్త ఔట్ ఫిట్ లో జాన్వీ కపూర్ పిక్స్ చూడాల్సిందే మరి….
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే రెండు మూడు గంటల్లో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే బోడుప్పల్, మేడిపల్లి, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్‌పురా ప్రాంతాల్లో వర్షం పడుతోంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది.
మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మంచిర్యాల, నిజామాబాద్, హన్మకొండ, వరంగల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రాత్రి వరకు వర్షాలు కొనసాగుతాయని అంచనా. నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
AI replacing Keyboard and Mouse: ఐదేళ్ల తర్వాత మౌస్-కీబోర్డ్ అవసరమే ఉండదట.. మైక్రోసాఫ్ట్ సంచలనం
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!