DGCA : మొన్న జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు ప్రమాదంతో అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా “డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్” కీలక చర్య చేపట్టింది. ఢిల్లీ, మొంబయ్ సహా దేశంలోని ప్రధాన విమానయానాశ్రయాలు, పరిసర ప్రాంతాలు, స్థితిగతులు పై “సర్వేలెన్స్” నిర్వహించింది. భవిష్యత్తులో కూడా ఈ సర్వేలెన్స్ ను కొనసాగిస్తామని చెప్పింది. ఈ సర్వేలెన్స్ విమానాల భద్రత కోసం ఉపయోగిస్తారు. Read Also : Supreme Court : ‘ఆపరేషన్ సింధూర్’…
ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. 168 మంది ప్రయాణికులతో గౌహతి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కెఐఎ)లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో సరిపడ ఇంధనం లేకపోకపోవడంతో కెప్టెన్ 'మేడే కాల్' చేశాడు. దీంతో విమానం బెంగళూరులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకోగా.. తాజాగా బయటకు వచ్చింది.
ఎయిర్ ఇండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కఠిన చర్యలు తీసుకుంది. సిబ్బంది షెడ్యూలింగ్ విభాగానికి చెందిన ముగ్గురు సీనియర్ అధికారులను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. విమానయాన భద్రతా ప్రోటోకాల్‌లను తీవ్రంగా ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. బాధ్యత వహించిన అధికారులలో చురా సింగ్ (డివిజనల్ వైస్ ప్రెసిడెంట్), పింకీ మిట్టల్ (చీఫ్ మేనేజర్ – క్రూ షెడ్యూలింగ్), పాయల్ అరోరా (క్రూ షెడ్యూలింగ్ – ప్లానింగ్) ఉన్నారు. ఈ అధికారులను వెంటనే…
ప్రయాణికుల భద్రతే భద్రతే మాకు ప్రథమ కర్తవ్యమని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ పేరుతో తమ వినియోగదారులకు లేఖ రాశారు. ఇందులో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా AI171 విమాన ప్రమాదంపై స్పందించారు. అహ్మదాబాద్ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని.. కింద భవనంలో ఉన్న 34 మంది పౌరులూ ప్రమాదంలో మృతి చెందారని లేఖలో పేర్కొన్నారు.
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, అలాగే ప్రాణాలతో బయటపడిన వ్యక్తికి తక్షణ ఆర్థిక అవసరాలను నిమిత్తం రూ.25 లక్షల తాత్కాలిక పరిహారాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రూ. 1 కోటి ప్రకటించిన విషయం తెలిసిందే.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఈ విమానం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. తాజాగా.. విమానం కూలిపోయిన ప్రదేశం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఓ పోలీసు అధికారి వ్యాఖ్యలను ఉటంకిస్తూ వెల్లడించింది.
అహ్మదాబాద్‌లో నిన్న కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం శిథిలాల నుంచి గుజరాత్ ఏటీఎస్ ఓ డిజిటల్ వీడియో రికార్డర్ (DVR)ను స్వాధీనం చేసుకుంది. ఏటీఎస్ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి దానికి తీసుకెళ్తున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంశంపై అతడిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. "ఈ డీవీఆర్‌ని శిథిలాల నుంచి మేము స్వాధీనం చేసుకున్నాం. ఎఫ్ఎస్ఎల్ బృందం త్వరలో ఇక్కడికి వస్తుంది." అని సమాధానం ఇచ్చారు.
Aircraft Crashed: అర్జెంటినాలోని సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో బాంబర్డియర్ ఛాలెంజర్ 300 విమానం ప్రమాదవశాత్తు భవనంను ఢీకొన్న ఘటనలో పైలట్, కో-పైలట్ మరణించారు. పుంటా డెల్ ఏస్తే నుండి బయలుదేరిన ఈ విమానం సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో రన్‌వేపై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో లోపల కారణంగా, పక్కనే ఉన్న నివాస ప్రాంతాలలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చివరకు విమానం ఒక నివాస ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం వల్ల పక్కన ఉన్న కొన్ని ఇళ్లను…
ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏవో) గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగ్స్‌లో భారత్ 48వ స్థానానికి ఎగబాకినట్లు డీజీసీఏ అధికారులు వెల్లడించారు.