Air India: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం మరవక ముందే, ఇదే సంస్థకు చెందిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో విమానం పొట్ట నుంచి బయటకు వచ్చే రామ్ ఎయిర్ టర్బైన్(RAT) ఎలాంటి హెచ్చరికలు లేకుండా బయటకు వచ్చింది. దీంతో విమానం యూకేలోనే నిలిచిపోయింది.
వరుస విమాన ప్రమాద ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం జరిగిన ఓ ఘటన సంచలనం సృష్టించింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం AA3023 ల్యాండింగ్ గేర్‌లో మంటలు చెలరేగడంతో విమానాన్ని రన్‌వేపై నిలిపివేసి, అందులోని 179 మంది ప్రయాణికులను సురక్షితంగా డీ బోర్డు చేయించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, దీనితో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. Also Read: KTR: ఉమ్మడి వరంగల్లో కేటీఆర్ పర్యటన..…
Air India Crash: గత నెలలో అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన క్షణాలకే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఒక్కరు మినహా మొత్తం మంది చనిపోయారు. విమానంలో ఉన్న వారితో పాటు కింద ఉన్న వారితో సహా 270 మంది మరణించారు. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనన్ విమానం ప్రమాదానికి గురైంది.
Boeing Jets: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశ వైమానిక చరిత్రలోనే అత్యంత ఘోరమైన దుర్ఘటనగా నిలిచింది. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. విమాన ఇంజన్లకు ఇంధనాన్ని అందించే ‘‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్’’లు ఆఫ్ అయిపోయినట్లుగా ఇన్వెస్టిగేటర్లు తేల్చారు. అయితే, ఇలా ఎందుకు జరిగిందనే దానిపై విచారణ జరుగుతోంది.
Air India Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక రిపోర్ట్ వెల్లడైంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత 32 సెకన్ల లోపే ‘‘ఇంధన నియంత్రణ స్విచ్’’ల సమస్య తలెత్తినట్లు తెలిపింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు ఆఫ్ కావడంతోనే ఇంజన్లకు ఇంధనం అందడం లేదని పేర్కొంది. ఈ సమయంలో కాక్‌పిట్‌లో పైలట్లు మాట్లాడుకుంటూ.. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు ఎందుకు ఆఫ్ చేశామని ఒకరు ప్రశ్నించగా, మరొకరు నేను అలా చేయలేదని సమాధానం ఇచ్చారు. మొత్తంగా ,…
Air India Flight: ఎయిర్ ఇండియా విమానం ఘటనపై ప్రాథమిక నివేదిక వెల్లడైంది. 270 మంది ప్రాణాలను తీసిన ఈ ఘోర దుర్ఘనటలో ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కు వెళ్లాల్సిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన కేవలం 32 సెకన్లలోనే కుప్పకూలింది. కేవలం విమానంలో ఉన్న ఒక్క వ్యక్తి మాత్రమే బతికాడు.
Air India Crash: జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఈ విమానం, టేకాఫ్ అయన 30 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ ఘటనలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఉన్న సిబ్బంది, ప్రయాణికులే కాకుండా నేలపై ఉన్న పలువురు మరణించారు. అయితే, దర్యాప్తులో ఇంజన్ ఇంధన నియంత్రణ స్విచ్‌లపై పరిశోధకులు దృష్టి సారించిందని ప్రముఖ ఏవియేషన్ జర్నల్ ది…
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించి మరణాల సంఖ్యపై ఓ క్లారిటీ వచ్చేసింది. తొలుత ప్రమాదంలో 270 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. కానీ.. ఆ సంఖ్య ఇప్పుడు 260కి చేరుకుంది.
Rammohan Naidu : అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. ఇండియన్ ఫ్లైట్ యాక్సిడెంట్ లోనే అత్యంత ప్రమాదకరమైనదిగా దీన్ని చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకునే బ్లాక్ బాక్స్ విచారణ మీదనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ బ్లాక్ బాక్స్ ను విదేశాలకు తరలించి అక్కడ విచారణ జరిపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. Read Also : Kannappa : కన్నప్పకు…