DGCA : మొన్న జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు ప్రమాదంతో అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా “డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్” కీలక చర్య చేపట్టింది. ఢిల్లీ, మొంబయ్ సహా దేశంలోని ప్రధాన విమానయానాశ్రయాలు, పరిసర ప్రాంతాలు, స్థితిగతులు పై “సర్వేలెన్స్” నిర్వహించింది. భవిష్యత్తులో కూడా ఈ సర్వేలెన్స్ ను కొనసాగిస్తామని చెప్పింది. ఈ సర్వేలెన్స్ విమానాల భద్రత కోసం ఉపయోగిస్తారు.
Read Also : Supreme Court : ‘ఆపరేషన్ సింధూర్’ లో పాల్గొంటే కేసు నుంచి రక్షణ ఇవ్వాలా..?
పౌర విమానయాన వ్యవస్థలో ఉండే లోపాలు, లోటుపాట్లు గుర్తించి వాటిని సరిచేయడానికి ఈ సర్వేలెన్స్ నిర్వహిస్తారు. దేశంలోని పౌరవిమానయాన వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని.. విమాన ప్రయాణాలు మరింత సేఫ్టీగా ఉండేలా చూసేందుకు ఈ సర్వేలెన్స్ ను చేపట్టింది డీజీఎస్ ఏ. విమాన ప్రయాణాలపై ప్రజలకు మరింత నమ్మకం కలిగించేందుకు ఈ చర్యలు చేపట్టింది. విమానంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా అనేది ఇందులో గుర్తిస్తారు.
Read Also : Kannappa : కన్నప్పకు అదే అతిపెద్ద సమస్య..?