అహ్మదాబాద్‌లో నిన్న కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం శిథిలాల నుంచి గుజరాత్ ఏటీఎస్ ఓ డిజిటల్ వీడియో రికార్డర్ (DVR)ను స్వాధీనం చేసుకుంది. ఏటీఎస్ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి దానికి తీసుకెళ్తున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ అంశంపై అతడిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. “ఈ డీవీఆర్‌ని శిథిలాల నుంచి మేము స్వాధీనం చేసుకున్నాం. ఎఫ్ఎస్ఎల్ బృందం త్వరలో ఇక్కడికి వస్తుంది.” అని సమాధానం ఇచ్చారు. ఇది లభ్యమైనప్పటి నుంచి ఓ ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. డీవీఆర్, బ్లాక్ బాక్స్ ఒక్కటే అని కొందరు భావిస్తున్నారు.
READ MORE: Boeing: బోయింగ్‌ని ముందే హెచ్చరించిన మాజీ ఉద్యోగి.. ఆ తర్వాత అనుమానాస్పద మృతి..
కానీ.. డీవీఆర్, బ్లాక్ బాక్స్ ఒక్కటి కాదు.. డీవీఆర్‌లు నిఘా ప్రయోజనాల కోసం భద్రతా కెమెరాల నుంచి వీడియో ఫుటేజ్‌ను రికార్డ్ చేస్తాయి. ఈ వీడియో డేటా సాధారణంగా హార్డ్ డ్రైవ్ లేదా క్లౌడ్ స్టోరేజ్‌లో నిల్వ చేయబడుతుంది. డీవీఆర్‌లు కేవలం సీసీటీవీ ఫుటేజీని రికార్డ్ చేస్తాయి. బ్లాక్ బాక్స్ (ఫ్లైట్ డేటా రికార్డర్) విమాన వేగం, ఎత్తు, ఇంజిన్ థ్రస్ట్ మొదలైన విమాన డేటాను, కాక్‌పిట్ ఆడియో (పైలట్ సంభాషణ) వంటి విమాన డేటాను రికార్డ్ చేస్తుంది. ప్రమాదం ఏ స్థాయిలో జరిగినా.. అది దెబ్బతినకుండా ఉండేలా రూపొందిస్తారు. విమానంలో చివరి క్షణంలో ఏం జరిగింది? అనే అంశం, దానికి సంబంధించిన వీడియో ఫుటేజీని ఈ డీవీఆర్ ద్వారా చూడవచ్చు.
READ MORE: Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు మళ్లీ నిరాశే.. 10 రోజుల వ్యవధిలో రెండో ఫైనల్ ఓటమి!