T20 World Cup 2022: ఈనెల 16 నుంచి టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ప్రారంభం కాబోతున్నాయి. అయితే అసలు టోర్నీ మాత్రం ఈనెల 22న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఆరంభం అవుతుంది. ఈనెల 23న టోర్నీలోనే హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. ఆరోజు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పైనే క్రికెట్ అభిమానుల ఆసక్తి నెలకొంది. ఈ మెగా టోర్నీకే ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆసియా కప్ తర్వాత దాయాది దేశాలు…
Uber Cab:క్యాబ్ కంపెనీ ఆరు కిలోమీటర్ల ప్రయాణానికి ఓ యువకుడి నుంచి రూ.32 లక్షలు వసూలు చేసింది. ఇంత భారీ బిల్లు చూసి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్న యువకుడి స్పృహ తప్పింది. వెంటనే కంపెనీకి చెందిన కస్టమర్ కేర్ సర్వీస్‌కు ఫోన్ చేశాడు. ఆ తర్వాత మొత్తం వ్యవహారం సద్దుమణిగింది. ఉబర్, ఓలా, ర్యాపిడో అంటూ క్యాబ్, బైక్ సర్వీసులు వచ్చాయి. వెంటనే ఎక్కిడికైనా వెళ్లాలంటే చాలు ఆన్ లైన్లో వాటిని బుక్ చేసుకుని ప్రయాణం…
Australian Scientists Seek To Grow Plants On Moon By 2025: చంద్రులు భూమికి ఉన్న సహజ ఉపగ్రహం. భూమిపై జీవజాలానికి ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తోంది. అందుకే మనం ఉంటున్న భూమిని తల్లిగా.. చంద్రున్ని చందమామగా పిలుస్తుంటాం. భూమి కక్ష్యకు, భూమి స్థిరత్వానికి చంద్రుడు సహకరిస్తుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే భూమిని ఓ టెలివిజన్ అనుకుంటే.. చంద్రుడు ఓ స్టెబిలైజర్ లాంటి వాడు. ఇంతలా భూమికి సహకరిస్తుంటాడు. ఒక వేళ చంద్రుడే లేకపోతే.. మనం…
Dhavaleshwaram project: గోదావరి నదిపై ఏపీలో నిర్మించిన ధవళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా ఈ ప్రాజెక్టు గుర్తింపు పొందింది.
IND Vs AUS: ఆసియా కప్ వైఫల్యాన్ని భారత్ కొనసాగించింది. మొహాలీలో టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా చెలరేగి ఆడింది. మరోసారి టీమిండియా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారీ లక్ష్యాన్ని సైతం ఛేదించింది. కామెరూన్ గ్రీన్ 30 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి బలమైన పునాది వేశారు. చివర్లో మాథ్యూ వేడ్ 21 బంతుల్లో 45 పరుగులు చేయడంతో 209 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.2 ఓవర్లలోనే ఆస్ట్రేలియా…
IND Vs AUS: మొహాలీలో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ రోహిత్ 11 పరుగులకే అవుట్ కాగా విరాట్ కోహ్లీ 2 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడి ఆసీస్ బౌలర్లకు కళ్లెం వేశాడు.…
మొహాలీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆశ్చర్యకరంగా బుమ్రాను తుది జట్టులోకి తీసుకోకుండా ఉమేష్ యాదవ్‌కు అవకాశం ఇచ్చింది. అటు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ బదులు దినేష్ కార్తీక్‌ను జట్టులోకి తీసుకుంది. ఆల్‌రౌండర్ కోటాలో దీపక్ హుడా బదులు అక్షర్ పటేల్‌కు అవకాశం కల్పించింది. రోహిత్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌కు రానున్నారు. కాగా రానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్…
Aaron Finch: ఆస్ట్రేలియా జట్టు వన్డే కెప్టెన్ అరోన్ ఫించ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ తనకు చివరిది అని అరోన్ ఫించ్ పేర్కొన్నాడు. దీంతో ఆదివారం న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో వన్డే ఫించ్ వన్డే కెరీర్లో చివరిది కానుంది. అరోన్ ఫించ్ ఇప్పటివరకు 145 వన్డేలు ఆడి 5,041 పరుగులు చేశాడు. వీటిలో 17 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు…