Latest ICC World Cup 2023 Points Table: ఐసీసీ పురుషుల వన్డే క్రికెట్ ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 134 పరుగుల తేడాతో విజయం సాధించింది. మెగా టోర్నీలో తన తొలి మ్యాచ్‌లో శ్రీలంకను భారీ తేడాతో ఓడించిన దక్షిణాఫ్రికాకు ఇది రెండో విజయం. రెండు భారీ విజయాలు అందుకున్న ప్రొటీస్ జట్టు ప్రస్తుతం ప్రపంచకప్ 2023 పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. దక్షిణాఫ్రికా రన్‌రేట్…
Australia Lost Four Consecutive Matches in ODI World Cup history: ఐదు సార్లు వన్డే ప్రపంచకప్ చాంపియన్ ఆస్ట్రేలియా చెత్త రికార్డ్ నమోదు చేసింది. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో మొదటిసారిగా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అటల్ బిహారీ వాజపేయ ఏకానా స్టేడియంలో గురువారం దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన ఆసీస్.. ఈ చెత్త రికార్డు నమోదు చేసింది. ప్రపంచకప్ 2023 ఫేవరెట్, పటిష్ట ఆస్ట్రేలియా ఇలా వరుసగా ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి…
ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. 134 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికా గెలుపొందింది. 312 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 40.5 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్ల దాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ విఫలమయ్యారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు.. ఆరంభంలోనే ఓపెనర్లు పెవిలియన్ బాట పట్టారు.
వన్డే వరల్డ్ కప్-2023 లో భాగంగా ఈరోజు సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ లక్నో వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ చరిత్ర సృష్టించాడు. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను బ్యాటింగ్ కు పంపింది. ఈ మ్యాచ్ లో డికాక్ మరో సెంచరీ బాదాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ బోణీ కొట్టింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. 199 పరుగులకే ఆలౌటైంది.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా రేపటి మ్యాచ్ గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందించారు. అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలలో తమ దేశంలో కంటే భారతదేశంలో ఎక్కువ వైట్ బాల్ క్రికెట్ ఆడామని, దాని వల్ల ఇక్కడి పిచ్ పరిస్థితులు తనకు బాగా తెలుసన్నారు.
వన్డే వరల్డ్ కప్ లో ఆతిథ్య భారత్ రేపు(ఆదివారం) ఆస్ట్రేలియాతో తలపడనుంది. తొలిసారి వరల్డ్ కప్ భారత్ నిర్వహిస్తుండటంతో.. ఎలాగైనా కప్ ను సొంతం చేసుకోవాలనే ఆశతో ఉన్నారు టీమిండియా. మరోవైపు రేపటి మ్యాచ్ లో కొందరు ఆటగాళ్లు ఆటడంలేదు. దీంతో ప్లేయింగ్ ఎలెవన్ లో ముగ్గురు స్పిన్నర్లను చేర్చుకునే అవకాశం ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.
రేపు (ఆదివారం) చెన్నై వేదికగా వరల్డ్ కప్‌లో భారత్ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవాలనే కసితో భారత్ బరిలోకి దిగుతుంది. మరోవైపు రేపటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై గెలుపొంది.. శుభారంభాన్ని అందించాలని అనుకుంటుంది. ఇక టీమిండియాపై ఆస్ట్రేలియా జట్టుకు మంచి రికార్డులు ఉన్నప్పటికీ.. రేపటి మ్యాచ్ లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.