Australia : మీరు విమానంలో కూర్చున్నప్పుడు, మీకు సురక్షితంగా ల్యాండింగ్ జరగాలని.. మీ గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవాలని ఆ ఒక్క విషయమే ప్రార్థిస్తారు. అయితే విమానం ల్యాండింగ్ సమయంలో ట్రాఫిక్‌ను నియంత్రించే వ్యక్తి నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?
Australia Player Will Pucovski Retire: ఆస్ట్రేలియా క్రికెటర్ విల్ పుకోవ్స్కీ క్రికెట్ కెరీర్ మధ్యలోనే ఆగిపోయింది. అనేక తల గాయాల కారణంగా, వైద్యులు అతనిని క్రికెట్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కారణంగా ఈ వర్ధమాన ఆస్ట్రేలియా క్రికెటర్ ఇంత త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాడు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు పుకోవ్స్కీ తలకు చాలాసార్లు గాయాలయ్యాయి. మార్చి 2024లో అతనికి తగిలిన గాయం చాలా తీవ్రంగా మారింది. పదే పదే గాయాలు అతని ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని…
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియన్ కోచ్ రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. గాయం తర్వాత బుమ్రా తిరిగి మైదానంలోకి వచ్చిన తీరు అభినందనీయమని పాంటింగ్ అన్నాడు.
ICC World Test Championship: భారత క్రికెట్ జట్టు ఇటీవల శ్రీలంకలో పర్యటించింది. అక్కడ మూడు ODIలు, 3 టి20 మ్యాచ్‌లు ఆడింది. టీ20 సిరీస్‌లో భారత్ 3-0తో శ్రీలంకను వైట్‌వాష్ చేసింది. శ్రీలంక జట్టు వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. శ్రీలంక టూర్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లకు దాదాపు 43 రోజుల విరామం లభించింది. విరామం తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.…
తనకు లాస్ ఏంజిల్స్‌లో ఆడాలనుందని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు. ఒలింపిక్స్ పోటీలను చూసినప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుందని, అందులో భాగం కావాలనుందని చెప్పాడు. ఇటీవల పారిస్ నగరంలో ఒలింపిక్స్ ముగిసిన విషయం తెలిసింది. ఇక లాస్ ఏంజిల్స్ వేదికగా 2028లో ఒలింపిక్స్ జరగనున్నాయి. 1900 సంవత్సరం తర్వాత విశ్వ క్రీడల్లో క్రికెట్‌కు చోటు కల్పిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్ణయం తీసుకుంది. Also Read: Kandula Durgesh: పోలవరం ప్రాజెక్టు దస్త్రాల దహనం..…
ఐసిసి రివ్యూలో పాంటింగ్ మాట్లాడుతూ, ''ఇది చాలా ఆసక్తికరమైన సిరీస్ కానుంది. ఇక్కడ గత రెండు సిరీస్‌లలో ఏమి జరిగిందో చూస్తే, ఆస్ట్రేలియాలో భారత్‌పై ఆస్ట్రేలియా నిరూపించుకోవాల్సింది చాలా ఉంది. మేము ఇప్పుడు భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడతాము, ఇది రెండవ అత్యంత ముఖ్యమైన విషయం. ఇటీవలి కాలంలో కేవలం నాలుగు టెస్టులు మాత్రమే జరిగాయి. ఐదు టెస్టులపై అందరూ ఉత్సాహంగా ఉన్నారు. పెద్దగా డ్రా అయ్యే టెస్టులు ఉండకపోవచ్చు" అని పాంటింగ్ అన్నాడు. ఇక…
Hop On Kangaroo: టూరిజం పేరుతో కపుల్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ విదేశాలకు తీసుకెళ్లే ఆఫర్స్ చూస్తుంటాం.. కానీ, స్పోర్ట్స్ టూరిజం ఎప్పుడైనా విన్నారా..? మీకు క్రీడలపై ఆసక్తి ఉంటే చాలు.. విదేశాలకు తీసుకెళ్లి స్టార్ ప్లేయర్స్‌తో గేమ్స్ ఆడే అవకాశం కల్పిస్తోంది ఓ సంస్థ. ప్రతిష్టాత్మక సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెంచేందుకు ఓ వినూత్న ప్రయోగానికి “హాప్ ఆన్ కంగారు “సంస్థ శ్రీకారం చుట్టింది. ఇక, ఇందు కోసం ఏం చేయాలి..? విదేశాలకు వెళ్లేందుకు…
భారత హాకీ జట్టు నేడు ఆస్ట్రేలియాతో తలపడింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తన సత్తాను చాటింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడం 52 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం.
పశ్చిమ ఆస్ట్రేలియాలో గురువారం రెండు హెలికాప్టర్ల ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయన్న సమాచారం తెలియాల్సి ఉంది. కాగా.. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రెండు హెలికాప్టర్లలో ఇద్దరు పైలట్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.