Most Consecutive Test Wins: క్రికెట్‌లో అత్యంత కఠినమైన ఫార్మాట్ టెస్ట్ మ్యాచ్. ఏ జట్టుకైనా ఇందులో గెలవడం చాలా కష్టం. అయితే, ఈ ఫార్మాట్ ను ఏళ్ల తరబడి శాసించిన అనేక జట్లు ఉన్నాయి. మొదట్లో వెస్టిండీస్ క్రికెట్ జట్టును ఓడించడం చాలా కష్టంగా ఉండేది. ఆ తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కూడా ఈ ఫార్మటులో హావ చూపించింది. ఇకపోతే వరుసగా అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన జట్ల గురించి తెలుసుకుందాం.
Ganesh Immersion : గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసి.. 10గంటలు మళ్లీ దానికోసం వెతికారు
ఈ జాబితాలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఆ జట్టు రెండుసార్లు వరుసగా 16 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఈ సిరీస్ మొదట 1999లో స్టీవ్ వా కెప్టెన్సీలో ప్రారంభమైంది . ఫిబ్రవరి 27, 2001 వరకు వరుసగా 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అలాగే రికీ పాంటింగ్ కెప్టెన్సీలో కూడా 2005 సంవత్సరంలో కూడా ఈ ఘనత సాధించింది . జనవరి 2, 2008 వరకు, జట్టు వరుసగా 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
Nagari Politics: వైసీపీ ప్రక్షాళన..! మాజీ మంత్రి రోజా వ్యతిరేకులపై వేటు..
ఈ జాబితాలో ఆస్ట్రేలియా తర్వాత వెస్టిండీస్ జట్టు ఉంది. ఆ జట్టు వరుసగా 11 టెస్టుల్లో విజయం సాధించింది. 1984లో ఆస్ట్రేలియాపై విజయంతో మొదలుపెట్టి అదే సంవత్సరం డిసెంబర్ నెలలో కంగారూ జట్టుపై తన 11వ విజయాన్ని కూడా అందుకుంది. ఆ సమయంలో వెస్టిండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్. ఆ కాలంలో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ చాలా ప్రమాదకరమైనదిగా పేరు గాంచింది.
IND vs BAN: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు ఆడేందుకు చెన్నై చేరుకున్న భారత ఆటగాళ్లు..
ఈ జాబితాలో మూడో స్థానంలో శ్రీలంక క్రికెట్ జట్టు , దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు వరుసగా 9 టెస్టుల్లో విజయం సాధించాయి. 2001లో సనత్ జయసూర్య కెప్టెన్సీలో శ్రీలంక విజయాల పరంపర మొదలైంది. తమ 9వ విజయం 2003లో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఇక ఈ లిస్ట్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ జట్లు నాలుగో స్థానంలో ఉన్నాయి . 1920-21లో కంగారూ జట్టు వరుసగా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కెప్టెన్ మైఖేల్ వాన్ నేతృత్వంలో మే 2004 నుంచి డిసెంబర్ 2004 వరకు ఇంగ్లండ్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచింది.