ENG vs AUS: మరోసారి చతికిలపడ్డ ఇంగ్లాండ్.. రెండో వన్డేలోనూ ఆస్ట్రేలియా విజయం..
- రెండో వన్డేలో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా విజయం.
- వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యం
- మార్ష్-క్యారీ తర్వాత స్టార్క్ అద్భుతమైన ప్రదర్శన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ENG vs AUS 2nd ODI: మిచెల్ మార్ష్ సారథ్యంలోని ఆస్ట్రేలియ క్రికెట్ జట్టు, ఐదు మ్యాచ్‌ల రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను 68 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. వన్డేల్లో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా 14వ విజయం. లీడ్స్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో 271 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 40.2 ఓవర్లలో 202 పరుగులకే కుప్పకూలింది. జేమీ స్మిత్ మినహా మరే ఇతర ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ కూడా పిచ్‌పై ఎక్కువసేపు నిలువలేకపోయారు. ఈ మ్యాచ్‌లో విజయంతో ఆస్ట్రేలియా సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా తరఫున మిచెల్ స్టార్క్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. జోష్ హేజిల్‌వుడ్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆరోన్ హార్డీల ఖాతాలో చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఆడమ్ జంపాకు ఒక వికెట్ దక్కింది. జామీ స్మిత్ 49 పరుగుల ఇన్నింగ్స్‌తో పాటు, బెన్ డకెట్ 32 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, ఆదిల్ రషీద్ 27 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ జట్టు ఆరంభం నుంచి చివరి వరకు నిర్ణీత వ్యవధిలో వికెట్లు కోల్పోతూనే ఉంది. దీంతో మ్యాచ్ వారి చేతుల్లోంచి జారిపోయింది.
T20 World Cup 2024: టీమిండియాకు గాయల బెడద.. నలుగురు స్టార్ ప్లేయర్స్..!
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ఇక 74 పరుగులతో ముఖ్యమైన ఇన్నింగ్స్‌కు గాను అలెక్స్ కారీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అంతకుముందు ఆస్ట్రేలియా 44.4 ఓవర్లలో 270 పరుగులేక్ ఆలౌట్ అయ్యింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించిన వారికి శుభారంభం లభించక, ఒక దశలో 200 పరుగులకు చేరుకోవడానికి కూడా ఇబ్బంది పడింది. అయితే కెప్టెన్ మిచెల్ మార్ష్ (59 బంతుల్లో 60 పరుగులు) మాత్రమే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా హాఫ్ సెంచరీ సాధించాడు. మొదటి వన్డేలో అజేయంగా 154 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ఆస్ట్రేలియా యొక్క ఏడు వికెట్ల విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించిన హెడ్ కేవలం 29 పరుగులు చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!