బీఏసీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి... టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకి ఆఫర్ ఇచ్చారు.. మీరు ఏ అంశం కావాలన్న చర్చకు మేం రెడీ.. సభలో చర్చకు సహకరిస్తారా..? లేదా..? అని ప్రశ్నించారు..
వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని.. త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు టూలెట్ బోర్డు ఖాయమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అప్పులు, కేసులపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాలపై లేదని మండిపడ్డారు. విశ్వవ్యాప్తంగా తెలుగువారి పరువు తీసిన ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోకుండా తెదేపాపై నోరు పారేసుకోవడం వైకాపా నేతలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Atchannaidu Allegations on AP Government: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. గత మూడేళ్లలో ఏపీలో ఎన్నో అరాచకాలు జరిగాయని.. దళితులపై దాడులు, ఆడపిల్లలపై అత్యాచారాలు, కల్తీ మద్యం, ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపై డాడులు జరిగాయని అచ్చెన్నాయుడు ఆరోపించారు. భూ కబ్జాలు, మైనింగ్ మాఫియా, శ్యాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మట్టి మాఫియా, కోర్టు ధిక్కారాలు, చెత్త రోడ్లు ఇలా…