Dadisetti Raja Fires On Yanamala Ramakrishnudu: యనమల రామకృష్ణుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం తునిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అచ్చెంనాయుడు సీఎం పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారని, పార్టీలో తానం నంబర్ 2 అని చెప్పుకునే యనమల అందుకు ప్రయత్నించాలని హితవు పలికారు. యనమల ఇలాగే అబద్ధాలు మాట్లాడితే.. వాస్తవాలు చూపించి మరీ చెప్పు తీసుకొని కొడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తుని దురదృష్టంకొద్దీ మహా మేధావి యనమల ఇక్కడ పుట్టాడంటూ దుయ్యబట్టారు. విద్యావ్యవస్థ గురించి యనమల అవాకులు, చవాకులు పేలుతున్నాడని.. నీ విమర్శలకి ప్రజలు చెప్పుతో సమాధానం చెప్తారని మండిపడ్డారు.
Kriti Verma: కృతి మెడకు ఉచ్చు.. అడ్డంగా బుక్ చేయించిన రిలేషన్‌షిప్
రాష్ట్రంలో ఉన్న విద్యావ్యవస్థను ఫాలో అవుతూ.. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని దాడిశెట్టి స్పష్టం చేశారు. అనేక విషయాల్లో రాష్ట్రానికి గుర్తింపు లభించిందని.. నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చామని అన్నారు. విద్య, వైద్య రంగాలకు అత్యధికంగా ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. యనమల స్వగ్రామమైన ఏవీ నగరంలో స్కూల్స్ కోసం ఏకంగా రూ.1 కోటి 60 లక్షలు ఖర్చు పెట్టామని.. అవసరమైతే నీ ఇంటికొచ్చి నిరూపిస్తానని, దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. అసందర్భ ప్రేలాపనలు, పచ్చి అబద్దాలు యనమల మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో టాయిలెట్లు కూడా లేవని.. కానీ ఇప్పుడు స్కూళ్ల రూపురేఖలు మార్చేశామని.. నిజాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని సూచించారు.
Paytm: పేటీఎంకు అలీబాబా షాక్..పెట్టుబడులు ఉపసంహరణ
హైస్కూల్ వస్తే మన పొలాల్లో పనిచేసేందుకు ఎవరూ ఉండరని యనమల మాట్లాడుతున్నారని.. విద్యా వ్యవస్థ గురించి ఆయనలా మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి రాజా పేర్కొన్నారు. బెండపూడి స్టూడెంట్స్ ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలియజేశారు. ఇదే సమయంలో లోకేష్ పాదయాత్రపై సెటైర్లు వేశారు. లోకేష్ ఒక బఫూర్ అని, లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పాదయాత్రకు ప్రజాదరణ లేకపోయినా.. ఎల్లో మీడియా ద్వారా గట్టిగా ప్రచారం చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
Minister KTR : కేంద్రం చేయాల్సిన పని చేయకుండా మాకు ఉపదేశాలు ఇస్తే ఎలా