ఏపీలో సీఐడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు. సీఎం జగన్ పెంపుడు చిలకలా ఏపీ సీఐడీ.. తప్పుడు కేసులు, బెదిరింపులు, దాడులే సీఐడీ విధులా..? అని ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టు పెడితే తప్పుడు కేసులు.. షేం షేం జగన్. చట్ట బద్దంగా, న్యాయ సూత్రాలకు అనుగుణంగా పని చేయాల్సిన ఏపీ సీఐడీ.. చట్ట వ్యతిరేక వ్యవస్థగా మారిపోతోంది. జగన్ ఆడమన్నట్లు ఆడుతూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు దిగుతోంది.
Read Also: Ayyanna Patrudu: ఏపీ సీఐడీ ఓవరాక్షన్ చేస్తోంది
ఐదేళ్ల పిల్లల్ని కూడా బెదిరించే స్థాయికి దిగజారిపోవడం జగన్ రెడ్డి అరాచక, నియంతృత్వ పోకడలకు నిదర్శనం. టీడీపీ నేత చింతకాయల విజయ్ పై అక్రమ కేసు నమోదు చేయడమే కాకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లో బీభత్సం సృష్టించడం దుర్మార్గం. ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పాటైన వ్యవస్థ పౌర హక్కుల్ని కనీసం గౌరవించకపోవడం బాధాకరం అన్నారు. జగన్ మాటలు విని గుడ్డిగా ముందుకు వెళ్తే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు తప్పవనే విషయాన్ని సీఐడీ అధికారులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
Read Also: Raghava Lawrence: డిసెంబర్ నుండి వేసవికి వెళ్ళిన ‘రుద్రుడు’!
గతంలో జగన్ మాటలు విన్న వారంతా ప్రస్తుతం కోర్టు కేసులు, జైళు శిక్షలతో పశ్చాత్తాప పడుతున్నారు. ప్రస్తుతం జగన్ మాట విని తప్పుడు కేసులు పెట్టి వేధించే ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో పశ్చాత్తాప పడడం తప్పదని గుర్తుంచుకోవాలి. తప్పుడు కేసులపై కోర్టుల్లో పోరాడుతాం. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటాం.
Read Also: Naga Vamsi: అన్నకు సమంత! తమ్ముడికి వర్ష బొల్లమ్మ!! ఎందుకంటే…