కృష్ణాజిల్లా గన్నవరంలో సోమవారం చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు సీరియస్ అయ్యారు. గన్నవరం ఎపిసోడులో టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ నేతలపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు 60 మందికి పైగా తెలుగుదేశం నేతలు, ఇతరులు పేరిట కేసులు నమోదయ్యాయి.
గన్నవరం తెలుగుదేశం నేతలు దొంతు చిన్నా, దొంతు రాణి సహా మరో 30 మందికి పైగా తెలుగుదేశం శ్రేణులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 143, 147, 341, 333, 353, 307, 448, 143, 147, 506, 509 r/w 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పట్టాభి, మరో 16 మందిపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు పోలీసులు. బోడె ప్రసాద్ తో పాటు మరో 11మందిపై 353, 143, 147, 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
మరోవైపు గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడిని టీడీపీ నేతలు ఖండించారు. సీఎం అండతో రాష్ట్రంలో వైసీపీ ఆకు రౌడీలు చెలరేగిపోతున్నారు.గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జగన్ రౌడీ పాలనకు పరాకాష్ట అన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. వైసీపీ రౌడీ మూకలు పట్టపగలే కార్యాలయంలోకి చొరబడి కార్యాలయంపై కర్రలు, రాళ్లతో దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు..?
Read Also: Buddha Venkanna: దమ్ముంటే రండి… తేల్చుకుందాం
గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరాచకం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.ఈ దాడికి సూత్రధారి వంశీనే, అతని కనుసన్నల్లోనే దాడి జరిగింది. వంశీ ఒక్క ఏడాది ఓపిక పట్టు నీ తల పొగరు అణిచివేస్తాం.టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిని, చేయించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. వల్లభనేని వంశీకి బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వస్తానని.. దమ్ముంటే రావాలంటూ వంశీకి బుద్దా సవాల్ చేశారు. ఎన్టీఆర్ సర్కిలుకు మీరూ రండి మేమూ వస్తాం.. కురుక్షేత్రమే అన్నారు. మీరో.. మేమో తేల్చుకుందాం అంటూ సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
Read Also: Tues Day Hanuman Chalisa Chanting Live: మంగళవారం హనుమాన్ చాలీసా వింటే…