Minor Girl Gangraped Case: అస్సాంలోని డింగ్ లో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితుల్లో ఒకరు శనివారం తెల్లవారుజామున మరణించారు. అందిన సమాచారం ప్రకారం., పోలీసు బృందం అతన్ని క్రైమ్ సీన్ రిక్రియేషన్ కోసం తీసుకెళ్లినప్పుడు నిందితుడు చెరువులో దూకాడు. దాంతో అతడు నీట మునిగి చనిపోయాడు. అతని చేతులకు సంకెళ్లు ఉండడంతో నీటిలో నుండి బయటకు రాలేక ఊపిరి ఆడక చనిపోయాడు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనకు సంబంధించి తఫ్జుల్…
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం (గ్యాంగ్ రేప్) జరిగిన ఘటన అస్సాంలో వెలుగు చూసింది. బాలిక గురువారం సాయంత్రం ట్యూషన్ క్లాస్ నుంచి ఇంటికి తిరిగి వస్తోండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసోంలోని నాగావ్ జిల్లాలో ఈ ఉదాంతం చోటుచేసుకుంది. కాగా.. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేసే వరకు నిరవధిక బంద్‌కు వివిధ సంస్థలు, నిర్వాసితులు డిమాండ్ చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ మిలిటెంట్ గ్రూప్ బాంబు బెదిరింపులకు దిగింది. అస్సాంలో 19 చోట్లు బాంబులు పెట్టినట్లుగా నిషేధిత తిరుగుబాటు గ్రూపు ఉల్ఫా-ఐ బెదిరించింది. మిలిటెంట్ గ్రూప్ బెదిరింపులతో పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి.
Himanta Biswa Sarma: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తి చేశారు. హిందువులు, ముస్లింల మధ్య జనాభా వ్యత్యాసం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. హిందువుల జనాభా తగ్గడం, ముస్లిం జనాభా పెరగడం జనాభా సమతుల్యాన్ని గణనీయంగా సవాల్ చేస్తుందని పేర్కొన్నారు.
కోల్కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసోంలోని సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ జారీ చేసిన అడ్వైజరీపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సూచనలు చేయడానికి బదులు క్యాంపస్లో భద్రతను పెంచాలంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో సదరు ఆస్పత్రి జారీ చేసిన సూచనల అడ్వైజరీని రద్దు చేసినట్లు ప్రకటించింది.
Himanta Biswa Sarma: బంగ్లాదేశ్ అల్లర్ నేపథ్యంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్, అస్సాంలో తగ్గుతున్న హిందూ జనాభాపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని ఆయన అన్నారు.
Ratan Tata : కొన్నేళ్ల క్రితం దేశంలోని అతిపెద్ద పారిశ్రామికవేత్తలలో ఒకరైన రతన్ టాటాకు ఒక కల వచ్చింది. ఆ కల స్వదేశీ సెమీకండక్టర్ చిప్. తద్వారా భారత్తో సహా చైనాపై ప్రపంచం ఆధారపడటం తగ్గుతుంది.