అస్సాం రాష్ట్రంలో 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. ట్యూషన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా పదో తరగతి విద్యార్థినిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. రోడ్లపైకి వచ్చి నానా హంగామా సృష్టించారు. దీంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించి.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు.
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ పేరుతో ఓ యువకుడు ఏకంగా రూ.22 వేల కోట్లను దోచేశాడు. విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షించి.. రెండు రాష్ట్రాలకు చెందిన వందల మందికి టోకరా వేశాడు.
Scam Alert: దేశంలో సైబర్ క్రైమ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రూ. 2,200 కోట్ల భారీ కుంభకోణాన్ని అస్సాం పోలీసులు బట్టబయలు చేశారు. నివేదిక ప్రకారం, ఈ పెద్ద స్కామ్ చేయడానికి సైబర్ మోసగాళ్ళు ఆన్‌లైన్‌లో షేర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని ప్రజలను మోసగించారు. ఈ కేసును విచారిస్తున్న అస్సాం పోలీసులు ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితులను దిబ్రూఘర్‌కు చెందిన ఆన్‌లైన్ వ్యాపారవేత్త విశాల్ ఫుకాన్,…
అస్సాంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఆర్మీ జవాన్ భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి బ్రహ్మపుత్ర నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్కు ముందు వాట్సాప్‌లో 'సారీ పిల్లలు' అని రాసింది. ఈ క్రమంలో.. దిబ్రూగఢ్‌లోని బోగిబీల్ బ్రిడ్జి టి-పాయింట్ సమీపంలో మహిళ, ఆమె పిల్లల కొన్ని వస్తువులను పోలీసులు గుర్తించారు. ఇది ఆత్మహత్యేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
NDA Splits Over Jumma Break: అస్సాం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ప్రతి మత విశ్వాసానికి దాని సంప్రదాయాలను కాపాడుకునే హక్కులను కాలే రాసే విధంగా ఉంది.
Himanta Biswa Sarma: యూనిఫాం సివిల్ కోడ్ అమలులో భాగంగా అస్సాంలోని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం కీలక బిల్లుకు గురువారం ఆమోదం తెలిపింది. ముస్లిం వివాహాలు-విడాకులను ప్రభుత్వం దగ్గర తప్పనిసరిగా నమోదు చేయాలనే బిల్లుని తీసుకువచ్చింది. ఈ బిల్లు కాజీ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు బహుభార్యత్వం, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయనుంది. కాంగ్రెస్ వంటి విపక్షాలు ఈ బిల్లుని విమర్శిస్తున్నప్పటికీ ఇది బాలికల అభ్యున్నతికి కీలక బిల్లు అని అస్సాం ప్రభుత్వం చెబుతోంది.
Assam: యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేసే దిశగా అస్సాంలోని హిమంత బిశ్వ సర్మ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. అస్సాం అసెంబ్లీ గురువారం రాష్ట్రంలోని ముస్లిం వివాహాలు-విడాకులుకు సంబంధించి పాత చట్టాన్ని తొలగించి, వివాహాలు విడాకులకు ప్రభుత్వ నమోదును తప్పనిసరి చేసే బిల్లును ఆమోదించింది.
Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాలీ మాట్లాడే మియా ముస్లింలు అస్సాం రాష్ట్రాన్ని ఆక్రమించుకోనివ్వమని ఆయన అన్నారు. మైనారిటీ ఓట్ల కోసం తాను పోటీలో లేనని చెప్పారు. నాగావ్‌లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలపై చర్చించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ తీసుకొచ్చిన వాయిదా తీర్మానాలపై అసెంబ్లీలో శర్మ మాట్లాడారు.
భారత్‌లోకి బంగ్లాదేశీయులు ప్రవేశంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో అస్థిరత నెలకొన్నప్పటికీ అక్కడి హిందువులు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించలేదని చెప్పారు. బంగ్లాదేశ్‌లో హిందువులు నివసిస్తున్నారు.. వారు పోరాడుతున్నారు. గత నెల రోజులుగా ఒక్క హిందువు కూడా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించలేదని అన్నారు.