CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
- బకాయిలు చెల్లించని మిల్లులపై సీఎం రేవంత్ సీరియస్
- డిఫాల్ట్ మిల్లులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశం
- మిల్లింగ్ బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించే యోచన
- 5 నియోజకవర్గాల్లో భారీ గోడౌన్ల పైలట్ ప్రాజెక్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణలో రైస్ మిల్లర్ల గోల్మాల్ వ్యవహారాలు , పెండింగ్ బకాయిలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో పౌర సరఫరాల శాఖపై గురువారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్ స్టీఫెన్ రవీంద్ర, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
డిఫాల్ట్ మిల్లుల స్వాధీనం.. మహిళా సంఘాలకు బిగ్ ఆఫర్
ఉద్దేశపూర్వకంగా డీఫాల్ట్ అయి ప్రభుత్వ బకాయిలు చెల్లించని రైస్ మిల్లులను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలా స్వాధీనం చేసుకున్న మిల్లులను, అవసరమైతే మిల్లింగ్ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు (మహిళా సంఘాలకు) అప్పగించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు కీలక సూచన చేశారు. మిల్లర్ల నుండి బకాయిల వసూలే ప్రధాన లక్ష్యంగా పక్కా విధానాన్ని (పాలసీ) రూపొందించాలని, దీనిపై త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి ఆమోదిస్తామని స్పష్టం చేశారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
మహిళా సంఘాల ఆధ్వర్యంలో 100 ఎకరాల్లో మోడల్ గోడౌన్లు
ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, ప్రాథమికంగా 5 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా సంఘాల ద్వారా 50 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో భారీ గోడౌన్ల నిర్మాణాన్ని చేపడతారు. ఈ గోడౌన్ల నిర్మాణంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న గోడౌన్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంతో పాటు, ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షించేందుకు ప్రతీ జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించాలని నిర్ణయించారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!