Himanta Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి కాంగ్రెస్ ఎంపీ, అస్సాం పీసీసీ చీఫ్ గౌరవ్ గొగోయ్‌ను మరోసారి టార్గెట్ చేశారు. ఆయన విదేశీ శక్తుల చేత నాటబడిన ఒక పాకిస్తానీ ఏజెంట్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన ఆరోపణలు అబద్ధమైతే, గొగోయ్ తనపై పరువునష్టం దాఖలు చేయాలని సవాల్ విసిరారు.
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సిట్ దర్యాప్తునకు ఆదేశించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)కి సూచించినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.
ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) హఠాన్మరణం చెందారు. సింగపూర్‌లో జరిగే నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం బోటుపై షికారు చేస్తుండగా ప్రమాదానికి గురైంది. లైఫ్ జాకెట్ ధరించకపోవడంతో నీళ్లలో శవమై కనిపించారు.
Himanta Biswa Sarma: చైనా భారతదేశానికి బ్రహ్మపుత్ర నీటిని ఆపేస్తే పరిస్థితి ఏమిటి..? అని దానిపై అస్సా సీఎం హిమంత బిశ్వ సర్మ స్పందించారు. దీనిపై ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో ‘‘భయంతో కాదు, వాస్తవాలు, నేషనల్ క్లారిటీతో ఈ అపోహను తొలగిస్తాం’’ అని అన్నారు. బ్రహ్మపుత్ర భారత్‌కి చేరిన తర్వాత పెరిగే నది అని, కుచించుకుపోయే నది కాదని ఆయన తెలిపారు.
Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష ఉపనేతగా ఉన్న గౌరవ్ గొగోయ్ పై అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ విమర్శలను మరింత రెట్టింపు చేవారు. గౌరవ్ గొగోయ్ కి పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్న హిమంత, ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీకి పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ నుంచి ఆహ్వానం అందిందని, అందుకే పొరుగు దేశం వెళ్లారని ఆరోపించారు. గొగోయ్ ట్రైనింగ్ పొందడానికి పాకిస్తాన్ వెళ్లారని, ఇది…
CM Himanta: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ఉప ప్రతిపక్ష నేతగా ఉన్న గౌరవ్ గొగోయ్ టార్గెట్‌గా అస్సా సీఎం హిమంత బిశ్వ సర్మ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. గొగోయ్ 15 రోజుల పాటు పాకిస్తాన్‌లో బస చేసినట్లు ఆయన ఆరోపించారు.
Himanta Biswa Sarma: అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిస్వ సర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ఉప ప్రతిపక్ష నేతగా ఉన్న గౌరవ్ గొగోయ్‌పై ఆరోపణలు చేశారు. గోగోయ్ పాకిస్తాన్‌లో 15 రోజులు గడిపారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన పరోక్షంగా పాక్ సైన్యానికి సహాయం చేసి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే, గౌరవ్ గొగోయ్ ఈ ఆరోపణలపై స్పందించలేదు. పాకిస్తాన్ పర్యటన గురించి సీఎం చేస్తున్న వ్యాఖ్యల్ని…
బీఫ్‌ను నిషేధించాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ భూపేన్ కుమార్ బోరా తనకు లేఖ రాస్తే నిషేధించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. ముస్లింల ప్రాబల్యం ఉన్న సంగూరి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీఫ్ పంపిణీ చేశారంటూ బీజేపీ నేతపై వచ్చిన ఆరోపణపై శర్మ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఈ అంశాన్ని లేవనెత్తినందుకు సంతోషంగా ఉందన్నారు.
Himanta Biswa Sarma: అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో భారత్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ మ్యాచుకి హాజరుకావడం వల్లే భారత్ ఓడిపోయిందని, చెడుశకునం అంటూ రాహుల్ గాంధీ విమర్శించడం వివాదాస్పదమైంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
వరల్డ్ కప్ లో టీమిండియా అన్ని మ్యాచ్‌లు గెలిచింది.. కానీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఓడిపోయాం.. ఆ మ్యాచ్‌లో మనం ఎందుకు ఓడిపోయామాని నేను ఎంక్వైరీ చేశాను అని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఇందిరా గాంధీ పుట్టిన రోజున వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడటం వల్లే భారత జట్టు విఫలమైంది అని ఆయన విమర్శించారు.