బీఫ్‌ను నిషేధించాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ భూపేన్ కుమార్ బోరా తనకు లేఖ రాస్తే నిషేధించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. ముస్లింల ప్రాబల్యం ఉన్న సంగూరి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీఫ్ పంపిణీ చేశారంటూ బీజేపీ నేతపై వచ్చిన ఆరోపణపై శర్మ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఈ అంశాన్ని లేవనెత్తినందుకు సంతోషంగా ఉందన్నారు. గతంలో ఈ సీటును కాంగ్రెస్ వరుసగా ఐదుసార్లు గెలుచుకుందన్నారు. “సంగురి సీటును 25 ఏళ్లుగా కాంగ్రెస్ గెలుచుకుంటోంది. సంగూరి లాంటి నియోజకవర్గంలో 27 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం కాంగ్రెస్ చరిత్రలోనే అతిపెద్ద అవమానం. ఇందులో ముఖ్యంగా చూడాల్సినది బీజేపీ విజయం కాదు.. కాంగ్రెస్ ఓటమి.” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE: Lal Salaam : ఓటీటీ కన్నా ముందే టీవీలో రజనీకాంత్ సినిమా?
గత నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డిప్లు రంజన్ శర్మ 24,501 ఓట్ల తేడాతో కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్ కుమారుడు తంజీల్‌పై విజయం సాధించారు. ఓటమి అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. దుఃఖం మధ్య రకీబుల్ హుస్సేన్ బీఫ్ తినడం తప్పని తెలిపారు. బీజేపీ ఓటర్లకు గొడ్డు మాంసం వడ్డించి ఎన్నికల్లో విజయం సాధించిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై సీఎం మాట్లాడుతూ.. బీఫ్ తినడం తప్పు కాబట్టి.. బీఫ్‌ను నిషేధించాలని నేను రకీబుల్ హుస్సేన్‌కు చెప్పాలనుకుంటున్నాను. బీఫ్ గురించి బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ మాట్లాడకూడదని.. అస్సాంలో దాన్ని నిషేధించాలని వారు నాకు వ్రాతపూర్వకంగా ఇవ్వాలి. దీంతో నేను కచ్చితంగా బ్యాన్ చేస్తా.” అని తెలిపారు.
READ MORE: Maharashtra Next CM: మహారాష్ట్ర సీఎం ఎవరో తేలిపోయింది?.. కేంద్ర మాజీ మంత్రి ప్రకటన