Mohammed Shami React On Team India Selection: టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతానికి భారత జట్టులో చోటు దక్కించుకునే విషయమై తనకు ఎలాంటి ఆశలూ లేవు అని తెలిపాడు. ఒక వేళ అవకాశం ఇస్తే మాత్రం తన పూర్తి శక్తి, సామర్థ్యాలతో ఆడటానికి ప్రయత్నిస్తా అని చెప్పాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు తాను అందుబాటులోనే ఉన్నానని, సెలక్షన్ అనేది నా చేతిలో లేని వ్యవహారం అని పేర్కొన్నాడు. ఇటీవల…
Virender Sehwag Game Changers List for 2025Asia Cup: ఆసియా కప్ 2025కి సమయం దగ్గరపడుతోంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి టోర్నీ మొదలు కానుంది. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. ఆసియా కప్ కోసం వచ్చే వారంలో యూఏఈకి టీమిండియా పయనం కానుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 15…
ఆసియా కప్ 2025 యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్ అఫ్గానిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య జరగనుంది. సెప్టెంబర్ 10న భారత్, యూఏఈ టీమ్స్ తలపడనున్నాయి. ఈ టోర్నీ కోసం అన్ని జట్లు ఇప్పటికే సన్నాహాలు మొదలెట్టాయి. ఆసియా కప్ నేపథ్యంలో మాజీలు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. తాజాగా శ్రీలంక మాజీ క్రికెటర్ ఫర్వేజ్ మహరూఫ్ తన అభిపాయాన్ని చెప్పాడు. ఆసియా కప్ టైటిల్ ఫేవరెట్ భారత్ అని చెప్పాడు.…
BCCI Terminates Dream 11 Sponsorship Deal: భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ ‘డ్రీమ్ 11’తో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒప్పందంను రద్దు చేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన నేపథ్యంలో.. బీసీసీఐ సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ ఇలాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకోమని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా తెలిపారు. కొత్త చట్టం కారణంగా ఒప్పందాన్ని కొనసాగించలేమని డ్రీమ్ 11 ప్రతినిధులకు బీసీసీఐ…
Asia Cup 2025: దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా ప్రకటించారు. స్పిన్ బౌలర్ల ఆధిపత్యం ఉన్న ఈ జట్టులో రషీద్‌తో పాటు నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఏఎం ఘజన్ఫర్ లతోపాటు అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీ కూడా ఉన్నారు. గతేడాది ఆఫ్ఘనిస్తాన్ టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్ వరకు చేరి జట్టు చరిత్ర సృష్టించింది. ఇక ఇటీవల జింబాబ్వే…
ఆసియా కప్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ను కొనసాగించగా.. శుభ్‌మన్ గిల్ కు వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ రింకూ సింగ్ కూడా ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, రింకూ జట్టులోకి ఎంపికవుతాడని ఊహించలేదట. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌లో రింకూ ఆట ఆశించినంతగా లేదు. దీని కారణంగా…
Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో టీ20 ఫార్మాట్లో ప్రారంభం కానుంది. ఇందులో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఎప్పటిలాగే టైటిల్ ఫేవరెట్‌గా టీమ్ ఇండియాపైనే అందరి దృష్టి ఉంటుంది. ఈ టోర్నమెంట్ కోసం భారత జట్టు ఎంపిక కూడా అయ్యింది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా, గిల్ వైస్ కెప్టెన్ గా మొత్తం 15 మంది సభ్యులను బీసీసీఐ ప్రకటించ్చింది. చివరిసారి…
భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లదని, పాకిస్తాన్ జట్టును కూడా భారతదేశానికి రావడానికి అనుమతించబోమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు , ఆసియా కప్, ఐసిసి టోర్నమెంట్లు వంటి బహుళ-దేశాల టోర్నమెంట్లను విడివిడిగా పరిగణిస్తారు. ఈ టోర్నమెంట్లు తటస్థ వేదికలో జరిగితే భారతదేశం వాటిలో పాల్గొనవచ్చు. భారత విధానంలో ఎటువంటి మార్పు లేదని, పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించే ప్రశ్నే లేదని…