ఆసియా కప్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ను కొనసాగించగా.. శుభ్‌మన్ గిల్ కు వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ రింకూ సింగ్ కూడా ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, రింకూ జట్టులోకి ఎంపికవుతాడని ఊహించలేదట. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌లో రింకూ ఆట ఆశించినంతగా లేదు. దీని కారణంగా అతను ఎంపిక కాకపోవచ్చునని అతను భావించాడు. కానీ సెలక్టర్లు రింకూపై నమ్మకం ఉంచి అతనికి జట్టులో స్థానం కల్పించారు. కాగా 2025లో జరిగిన UP T20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్ తరపున రింకు అద్భుతమైన సెంచరీ సాధించాడు. గౌర్ గోరఖ్‌పూర్ లయన్స్‌పై రింకు సింగ్ కేవలం 48 బంతుల్లోనే అజేయంగా 108 పరుగులు చేశాడు, ఇందులో 7 ఫోర్లు, 8 స్కైస్క్రాపర్ సిక్సర్లు ఉన్నాయి.
Also Read:Saipallavi : శ్రీలీల, కృతిశెట్టి, భాగ్య శ్రీ.. సాయిపల్లవిని చూసి నేర్చుకోండి..
ఆసియా కప్ లో చోటుపై రింకూ స్పందించాడు. ‘ ఆసియా కప్ జట్టులో నా పేరు చూసి నాకు స్ఫూర్తి కలిగింది . నా ప్రదర్శన బాగాలేదు, బహుశా నన్ను జట్టు నుంచి తొలగిస్తారని అనుకున్నాను. కానీ సెలెక్టర్లు నాపై నమ్మకం ఉంచి నన్ను ఎంపిక చేశారు. దీని కారణంగా, నా ఆత్మవిశ్వాసం పెరిగింది. UP T20 లీగ్‌లో ఆడిన సెంచరీ నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. భవిష్యత్తులో కూడా దానిని కొనసాగించాలనుకుంటున్నాను’ అని రింకు సింగ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రింకు సింగ్ మాట్లాడుతూ, ‘ఈ రోజుల్లో బౌలింగ్ చాలా ముఖ్యం. ఆటగాళ్లు బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ కూడా చేయాలని సెలెక్టర్లు కోరుకుంటారని తెలిపాడు. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం తనకు ఉందని, అయితే తనకు ఏ ప్లేస్ ఇచ్చినా తాను సిద్ధంగా ఉన్నానని రింకు తెలిపారు.
Also Read:Parliament: ప్రధాని మోడీ, వీవీఐపీల భద్రతకు ముప్పుగా మారిన చెట్టు.. అసలేంటి ఈ కథ..?
రింకు సింగ్ మాట్లాడుతూ, ‘నేను 2023లో 5వ స్థానంలో బ్యాటింగ్ చేశాను. నాకు 7, 8వ స్థానంలో బ్యాటింగ్ చేయడం ఇష్టం ఉండదు. కానీ జట్టు అవసరానికి అనుగుణంగా ఏ స్థానంలోనైనా ఆడుతానని అన్నాడు. నేను భారత జట్టు తరపున 33 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 3 హాఫ్ సెంచరీలు సాధించాను. ఫినిషర్ రోల్ మాత్రమే కాదు, నేను ప్రతి ప్లేస్ లో బ్యాటింగ్ చేయగలను’ అని అన్నారు. రింకు సింగ్ ఇప్పటివరకు భారత జట్టు తరపున 33 T20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 42 సగటుతో 546 పరుగులు చేశాడు.