Asia Cup 2025: సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 మొదలు కానుంది. అయితే ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. ఈ జట్టుతో ఆసియా కప్ గెలిచిన టి20 ప్రపంచ కప్ 2026 మాత్రం గెలవలేరని స్పష్టం చేశారు. అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడాన్ని కూడా ఆయన తప్పుపట్టాడు. ఆసియా కప్ 2025 కోసం అజిత్ అగార్కర్ సారధ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.
ఈ టీంలో శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వగా శ్రేయస్ అయ్యర్ కు అవకాశం దక్కలేదు. ఏడాది తర్వాత భారత టి20 జట్టులోకి వచ్చిన శుభమన్ గిల్ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. దీంతో టీం సెలెక్షన్ పై సర్వత్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ కు అవకాశం ఇవ్వకపోవడాన్ని చాలా మంది విశ్లేషకులు తప్పుపట్టారు.
India Japan Deals: జపాన్-భారత్ మధ్య కీలక ఒప్పందాలు.. 10 ఏళ్లలో 10 ట్రిలియన్ యెన్‌ల పెట్టుబడి..
తాజాగా టీం సెలెక్షన్ పై స్పందించిన శ్రీకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ జట్టుతో మనం ఆసియా కప్ గెలవచ్చేమో కానీ.. టి20 ప్రపంచ కప్ అయితే గెలవలేం అని కూడా బద్దలు కొట్టాడు. ఈ జట్టునే వరల్డ్ కప్ లో ఆడించాలి అనుకుంటున్నారా? మరో ఆరు నెలల్లో ప్రారంభమయ్యే టి20 ప్రపంచ కప్ కోసం ఇలానేనా సన్నద్ధమయ్యేది అంటూ టీం సెలక్షన్ పై మండిపడ్డారు. అసలు రింకు సింగ్, శివం దుబే, హర్షిత్ రాణాలను ఎలా ఎంపిక చేశారో అర్థం కావడం లేదు. జట్టు ఎంపికకు ఐపిఎల్ ప్రదర్శనలను ప్రామాణికంగా తీసుకోవాల్సింది.. కానీ, వారు అంతకుముందు ఆటను పరిగణలోనికి తీసుకుంటున్నట్లున్నారని వ్యాఖ్యానించారు.
India Japan Deals: జపాన్-భారత్ మధ్య కీలక ఒప్పందాలు.. 10 ఏళ్లలో 10 ట్రిలియన్ యెన్‌ల పెట్టుబడి..
ఇక ఐదవ స్థానంలో ఎవరు బ్యాటింగ్ విషయంలో సంజూ శాంసన్, జితేష్ శర్మ, శివం దుబే, రింకు సింగ్లలో ఎవరు ఆడతారు? అక్షర్ పటేల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయలేడు.. అసలు యశస్విని కాదని శివం దుబే ఎందుకు ఎంపిక చేశారో అర్థం కాలేదు. ఇక అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపిఎల్ లోనూ యశస్వి జైష్వాల్ అద్భుతంగా రాణించాడు. అతన్ని ఎలా పక్కన పెడతారని శ్రీకాంత్ ప్రశ్నించాడు. సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుండగా సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే తొలి మ్యాచ్ తో భారత్ తమ క్యాంపెయిన్ ను ప్రారంభించనుంది.