Asia Cup 2025: ఆసియా కప్ టైటిల్ ఫేవరెట్ భారత్.. కానీ..!
- సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం
- సెప్టెంబర్ 10న తలపడనున్న భారత్, యూఏఈ
- ఆసియా కప్ టైటిల్ ఫేవరెట్ భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2025 యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్ అఫ్గానిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య జరగనుంది. సెప్టెంబర్ 10న భారత్, యూఏఈ టీమ్స్ తలపడనున్నాయి. ఈ టోర్నీ కోసం అన్ని జట్లు ఇప్పటికే సన్నాహాలు మొదలెట్టాయి. ఆసియా కప్ నేపథ్యంలో మాజీలు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. తాజాగా శ్రీలంక మాజీ క్రికెటర్ ఫర్వేజ్ మహరూఫ్ తన అభిపాయాన్ని చెప్పాడు. ఆసియా కప్ టైటిల్ ఫేవరెట్ భారత్ అని చెప్పాడు. అయితే టీ20ల్లో ఏమైనా జరగొచ్చని.. శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు కూడా టైటిల్ గెలిచే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
తాజాగా ఫర్వేజ్ మహరూఫ్ మాట్లాడుతూ… ‘ఆసియా కప్ 2025 ఫేవరెట్ భారత్ అని నేను అనుకుంటున్నాను. అండర్ డాగ్స్ శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు టైటిల్ గెలిచే అవకాశం ఉంది. భారత్ జట్టు బలంగా ఉంది. అయితే ఇది టీ20 క్రికెట్. ఇక్కడ ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. పెద్ద టోర్నమెంట్లలో తనదైన రోజున ఏ టీమ్ అయినా రేచిపోవచ్చు. అందుకే ఎవరైనా ఛాంపియన్‌గా అవతరించొచ్చు’ అని చెప్పాడు. భారత్ అత్యధికంగా 8 సార్లు ఆసియా కప్ గెలుచుకుంది. శ్రీలంక ఆరుసార్లు కప్‌ను సొంతం చేసుకోగా.. బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా గెలవలేదు. బంగ్లా 2012, 2016, 2018లో ఫైనల్స్‌కు చేరినా విజేతగా నిలవలేకపోయింది.
Also Read
Also Read: Dog Bite: కుక్క కరిచిన ఆరు నెలల తర్వాత లక్షణాలు.. ఆ తర్వాత యువకుడికి ఏమైందంటే?
సెప్టెంబర్ 10న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో యుఎఇతో జరిగే మ్యాచ్‌లో భారత్ తన గ్రూప్ ఎ పోరును ప్రారంభిస్తుంది. సెప్టెంబర్ 14న అదే వేదికపై పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో తలపడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 19న అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో ఒమన్‌తో తలపడుతుంది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఉండటం టీమిండియాకు అదనపు బలం. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా లతో పేస్ విభాగం బలంగా ఉంది. శివం దుబే కూడా మీడియం పేస్ బౌలింగ్ చేస్తాడు. బ్యాటింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!