బంగాళాఖాతంలో ఏర్పడ్డ అసని తుఫాను వల్ల తీరప్రాంతం అలజడిగా వుంది. అక్కడక్కడా భారీవర్షాలు పడుతున్నాయి. అయితే తుఫాను కారణంగా ఓ మందిరం తీరానికి కొట్టుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ వింత చోటుచేసుకుంది. అసని తుఫాను ప్రభావంతో ఇతర దేశానికి చెందిన ఓ మందిరం సున్నాపల్లి రేవుకు కొట్టుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు చేరిన ఇతర దేశానికి చెందిన బంగారు వర్ణం కలిగిన రథంగా దీనిని భావిస్తున్నారు. అసాని తుపాన్ ప్రభావంతో ఇది సముద్రం…
ఏపీ తీరంలో అసని తీవ్ర తుఫాన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో పలు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. అటు రైల్వేశాఖ కూడా తక్షణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఏపీలో నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించి.. కొన్ని…
అసని తీవ్ర తుఫాన్‌గా మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని తీర ప్రాంతానికి ముప్పు ఏర్పడింది. అసని ప్రభావంతో కోస్తా తీరం అల్లకల్లోలంగా మారింది. వాతావరణశాఖ అంచనాలను తలకిందులు చేస్తూ అసని తీవ్ర తుఫాన్ తన దిశను మార్చుకుని కాకినాడ తీరం వైపుకు దూసుకువస్తోంది. దీంతో కాకినాడ, విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో అధికారులు గ్రేట్ డేంజర్ సిగ్నల్-10 జారీ చేశారు. అసని తీవ్ర తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి…
‘అసని’ తీవ్ర తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ క్రమంగా తీరాన్ని సమీపిస్తోంది. కాకినాడ తీరం వద్ద తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. యానాం-కాకినాడ తీరాన్ని తాకిన తర్వాత మళ్లీ తుఫాన్ సముద్రంలోకి వెళ్లనుంది అసని తుఫాన్. దీంతో ఏపీలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. ప్రస్తుతం కాకినాడకు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముందుగా అసని తుఫాన్ గమనాన్ని బట్టి ముందుగా అది ఏపీ తీరాన్ని…
అసని తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్‌లో వాన కురుస్తుంది. నగర వ్యాప్తంగా ఉదయం 4.30 గంటల నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో ఆకాశం మొత్తం మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో వాతావరణం చల్లబడటంతో నగరవాసులకు ఉక్కబోత నుంచి ఉపశమనం లభినట్లయింది. బుధవారం తెల్లవారుజాము నుంచే హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, నాంపల్లి, లక్డీకపూర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఉప్పల్, సికింద్రాబాద్‌లో వానకురుస్తున్నది. కాగా, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో చిరు జల్లులు పడుతున్నాయి. అసని తుఫాను…
ఏపీలో ఇంటర్ పరీక్ష వాయిదా పడ్డాయి. రేపు (మే 11) జరగాల్సిన ఇంటర్ పరీక్షని ఈనెల 25కి వాయిదా వేసినట్టు అధికారులు వేసినట్టు తెలిపారు. అసని తుఫాన్ కారణంగా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు బోర్డ్ ప్రకటించింది. కాగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ తీవ్రరూపం దాల్చి తీరం వైపు దూసుకొస్తుంది. ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, కాకినాడకి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను కారణంగా ఈ రోజు రాత్రి…
బంగాళాఖాతంలో అసని తుఫాన్ అలజడి రేపుతోంది. తీరం వైపు పయణిస్తోంది. తీరం వైపు గంటలకు 6 కిలోమీటర్ల వేగంతో పయణిస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తుఫాన్ కాకినాడకు 330 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. అసని తుఫాన్ కారణంగా విశాఖలో వాతావరణం మారిపోయింది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉంది. తీరం వెంబడి గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే విశాఖ వ్యాప్తంగా…
బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా కొనసాగుతున్న ‘అసని’ బలహీనపడుతున్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈరోజు తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్‌గా బలహీనపడి ఆ తర్వాత దిశ మార్చుకుంటుందని వెల్లడించింది. అనంతరం ఉత్తర ఈశాన్య దిశగా ఒడిశా తీరం వెంట పయనించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర తీరానికి ముప్పు తప్పనుంది. కాగా ప్రస్తుతం తీవ్ర తుఫాన్ అసని కదలికలను ఉత్తరాంధ్ర యంత్రాంగం నిశితంగా గమనిస్తోంది. ఈ మేరకు ఎల్లో…
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ప్రస్తుతం ఏపీలోని రైతులు, కౌలు రైతుల పరిస్థితి తయారైంది. ఆరుగాలం శ్రమించి పట్టెడన్నం పెట్టే రైతన్నను అకాల వర్షాలు, ఈదురు గాలులు దెబ్బతీస్తున్నాయి. అసని తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో తడిసి ముద్దైన ధ్యానం, పంట చేతికి వచ్చిన తరుణంలో నేలనంటిన వరి చేలు అన్నదాతలను కన్నీరు పెట్టిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అకాల వర్షాలు, ఈదురు గాలులు రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షాలు కురుస్తుండటంతో…
అసని తుఫాన్ ఏపీ వైపునకు దూసుకొస్తోంది. ఇప్పటికే ఇది తీవ్ర తుఫాన్‌గా మారింది. బంగాళాఖాతంలో విశాఖకు ఆగ్నేయంగా 670కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. రేపు రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి తీవ్ర తుఫాన్ ప్రవేశించనుందని ఐఎండీ అంచనా వేస్తోంది. గంటకు 19 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ దిశను మార్చుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం వెంబడి ప్రయాణిస్తుందని భావిస్తోంది. సని తుఫాన్ ఒడిశా వైపు వెళ్లినా.. ఏపీ తీరంపైనా తీవ్రంగా ప్రభావం చూపే అవకాశముంది. శ్రీకాకుళం,…