పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. మర్కజ్ సుభాన్ అల్లా బహవల్పూర్, మర్కజ్ తైబా, మురిద్కే, సర్జల్ / టెహ్రా కలాన్, మెహమూనా జోయా ఫెసిలిటీ, సియాల్కోట్, మర్కజ్ అహ్లే హదీస్ బర్నాలా, భీంబర్, మర్కజ్ అబ్బాస్, కోట్లి, మస్కర్ రహీల్ షాహిద్, ముజఫరాబాద్‌లోని షావాయి నల్లా క్యామ్, మర్కజ్ సయ్యద్నా బిలాల్ లో మెరుపు దాడులు చేసింది. భారత్ చేపట్టిన ఈ ప్రతీకార చర్యకు ‘ఆపరేషన్…
Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. శనివారం ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ ఒక విఫల దేశం’’ అని అభివర్ణించారు. అది ఎప్పుడూ భారత్‌ని శాంతియుతంగా జీవించనివ్వదు అని అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందున పాకిస్తాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్‌లో ఉంచేలా ప్రయత్నాలు చేయాలని చెప్పారు.
Asaduddin Owaisi: కేంద్రం ఇటీవల జనాభా లెక్కలతో పాటే ‘‘కులగణన’’ చేస్తామని ప్రకటించింది. 2024 ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్‌తో సహా పలు ఇండీ కూటమి పార్టీలు కులగణనను డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ-ఎన్డీయే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ కులగణనపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నల్ని లేవనెత్తారు. కులగణనకు కేంద్రం ఒక టైమ్ లైన్ ఉండాలని కోరారు.
Asaduddin Owaisi: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి దాయాది దేశం పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదంపై తరుచుగా చెప్పే ‘‘ఇంట్లోకి దూరి చంపేస్తాం’’ అనే దానికి బదులుగా ‘‘ వాళ్ల ఇంట్లోకి ప్రవేశించి అక్కడే ఉండాలి, అంతే’’ అని కేంద్రానికి అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలను భారత్ భయానికి ఖాళీచేస్తున్నట్లు వస్తున్న వార్తలపై అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ‘‘ వారు ఖాళీ చేసి…
Asaduddin Owaisi: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రవాద దాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. పాకిస్తాన్ సర్కార్, దాని నిఘా సంస్థ ISI యొక్క అక్రమ సంతానమే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అని ఆరోపించారు.
Asaduddin Owaisi : పాకిస్తాన్‌తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలన్న నిర్ణయాన్ని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు. అయితే, ఆ నీటిని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నిల్వ చేస్తుందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం, ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై ఒవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. “బైసరన్ మైదానంలో సీఆర్పీఎఫ్ జవాన్లను ఎందుకు మోహరించలేదు? దాడి జరిగిన తర్వాత అక్కడికి చేరుకోవడానికి ఎందుకు ఆలస్యమైంది?” అని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదులు మతం…
Asaduddin Owaisi: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దేశ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నామనే సందేశాన్ని పంపడానికి శుక్రవారం ప్రార్థనలకు వెళ్లేటప్పుడు ముస్లింలు తమ్ చేతులకు నల్ల బ్యాండ్ ధరించాలని విజ్ఞప్తి చేశారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి నిఘా వైఫల్యమే కారణమని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ దాడిని ఊచకోతగా ఆయన అభివర్ణించారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఇది ఉరి ప్రాంతం, పుల్వామా సంఘటనల కంటే ప్రమాదకరమైందని, బాధాకరమైందన్నారు. ఈ సంఘటనపై నరేంద్ర మోడీ ప్రభుత్వం జవాబుదారీతనంగా వ్యవహరించాని డిమాండ్ చేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వక్ఫ్ చట్టంపై వర్క్ షాప్ నిర్వహించారు. వర్క్ షాప్ కి బీజేపీ జాతీయ సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణలో వక్ఫ్ ఆదాయం ఎక్కడికి పోతుంది అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డి చెప్పాలి.. వక్ఫ్ ఆదాయం అసదుద్దీన్ అక్బరుద్దీన్ చెంచాలకు ఉపయోగపడుతుంది, తప్ప సామాన్యులకు ఉపయోగ పడడం లేదు.. వక్ఫ్ ఆదాయం బినామీల ద్వారా దారుస్సలంకి…